India Vs Pakistan Ceasefire: ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది కాబట్టి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. భారత్, పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయి. ఇవి గనక వేరే దారి వైపు వెళ్తే ప్రపంచం దాని ప్రభావాన్ని చవిచూడాల్సి వస్తుంది. అమెరికా మీడియేటర్ పాత్ర పోషించక తప్పలేదు.. ఎందుకంటే రెండు న్యూక్లియర్ ఫ్యూయల్ బాంబులు ఉన్న దేశాల మధ్య యుద్ధం ప్రపంచానికి ఏమాత్రం మంచిది కాదు. అది విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. అందువల్లే అమెరికా దేశానికి తప్పలేదు. పైగా ట్రంప్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కాబట్టి.. ఈ యుద్ధాన్ని ఆపడం వల్ల కాస్త అతడికి మంచి మార్కులే పడ్డాయి.
Also Read: భారత్, పాకిస్తాన్ యుద్ధం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..వీడియో వైరల్!
భారత్ ఏం తెలుసుకోవాలంటే..
అమెరికా చెప్పింది కాబట్టి భారత్ శాంతియుత వాతావరణానికి ఓకే చెప్పింది. ఒకవేళ అగ్రరాజ్యం చెప్పినట్టు భారత్ వినకపై ఉంటే ఆంక్షలు విధిస్తుంది. యూరోపియన్ యూనియన్ మనకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే మనం ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఉన్నాం. వచ్చే రోజుల్లో థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో భారత్ అమెరికా మాట వినాల్సిందే. తప్పదు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అది ఇప్పటికిప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కు పెద్ద దండం పెట్టాలి. ఎందుకంటే ఈ యుద్ధం గనుక ఇలానే కొనసాగి ఉంటే పాకిస్తాన్ పరువు మరింత దిగజారేది.
ఈ యుద్ధం వల్ల ఇండియా తన స్ట్రెంత్ ను వరల్డ్ ముందు గట్టిగా ఎక్స్ ఫోజ్ చేసింది. ఇకపై జరిగే ఏ దాడిని కూడా సహించబోనని సంకేతాలు ఇచ్చింది..
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. ముష్టి మూడు రోజులు యుద్ధం చేసే సత్తా కూడా దానికి లేదు. పైగా బొచ్చ పట్టుకొని ప్రపంచం ముందు అడుక్కోవలసిన పరిస్థితి దానికి ఏర్పడింది. గతంలో మంజూరైన రుణాన్ని ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చింది. అంటే తప్ప ఇప్పటికిప్పుడు ఇచ్చింది కాదు.
ఇక మనకు సంబంధించి.. మన మంచి కోరుకున్న దేశాలు ఏమిటో ఒక స్పష్టత వచ్చింది. టర్కీ, అజర్ బైజాన్ మన ఎనిమి కంట్రీస్ జాబితాలో చేరిపోయాయి. అజర్ బైజాన్ వల్ల పెద్దగా మనకు నష్టం లేదు కానీ.. టర్కీ ని మాత్రం ఉపేక్షించవద్దు.
పాకిస్తాన్ కు కూడా టర్కీ, అజర్ బైజాన్ తప్ప ఏ ఇస్లామిక్ దేశం కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరికి అంతటి చైనా కూడా దానికి అండగా లేకుండా పోయింది. చైనా ఇచ్చిన సరుకు బీ గ్రేడ్ కంటే దారుణంగా ఉంది.. ఉత్తరకొరియా మిస్సైల్స్ కూడా తాలుతప్పర అని తేలిపోయింది.
ఎయిర్ డిఫెన్స్ లో భారత్ ఎంత బలంగా ఉందో ఈ ఘటన ద్వారా తెలిసిపోయింది..ఎస్ -400 మాత్రమే కాకుండా, ఆకాష్, రాఫెల్ వంటి వాటి ప్రొటెక్షన్ మనకు ఎంత అవసరమో మరోసారి అర్థమైంది.. పాకిస్తాన్ వేసిన మిసైల్స్ ఒక్కటి కూడా మనదేశంలోకి రాలేదంటే..ఎస్ 400, ఆకాష్, రాఫెల్ లే కారణం.
ఇక ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు.. అంతర్గత శక్తులు ఎలా పనిచేస్తాయో ఈ యుద్ధం ద్వారా తెలిసి వచ్చింది. ప్రత్యేకంగా దేశ ఆర్మీ మీద నిత్యం విషం కక్కే సోషల్ మీడియా ఎకౌంట్లో మీద బ్యాన్ ఎంత అవసరమో మరోసారి అనుభవానికి వచ్చింది. ఒకరకంగా పాకిస్తాన్ కంటే వీరే మన దేశానికి అతిపెద్ద శత్రువులు.
దాయాది దేశం పిచ్చి లేసిన కుక్కలాగా వ్యవహరిస్తున్నప్పటికీ.. రిలీజియన్ పేరుతో ఈ దేశం విభజనకు గురి కాలేదు. ఓవైసీ లాంటి వ్యక్తి ఆర్మీకి సపోర్ట్ చేయడం ఒక పాజిటివ్ వైబ్ లాంటిది.
ఇక ఈ యుద్ధంలో అధికారుల మధ్య , ఆర్మీ మధ్య సమన్వయం ఎంత అవసరమో మరోసారి అనుభవానికి వచ్చింది. కీలకమైన అధికారులు ఒత్తిడిలో ఎంత గొప్పగా పనిచేస్తారో.. ప్రాక్టికల్ గా మనకు అనుభవంలోకి వచ్చింది.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఉదార గీతాలు పాడేవారు.. రకరకాల విభజనలకు గీత గీసేవారికి ఈసారి కేంద్ర ప్రభుత్వం చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. ఎందుకంటే ఒక ముస్లిం యువతి, ఓ సిక్కు యువతి యుద్ధం చేసిన విషయాలను ప్రపంచం చెప్పారు. ఫేక్ సెక్యులర్ గీతాల పాడే సన్నాసులకు వీడియోలు, ఫోటోల ద్వారా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు.