Indira Gandhi: ఇప్పుడంటే రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. భారతదేశం పరువును అమెరికా కేంద్రంగా తీస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్థానంలో ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. నరేంద్ర మోడీ స్థానంలో ఇందిరా గాంధీ ఉన్నారు.. నాటి కాలంలో దేశం ఇప్పటిలాగే పాకిస్తాన్ తో యుద్ధం చేయాల్సి వచ్చింది. పైగా పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా ఉంది. భారతదేశాన్ని ఏకాకిని చేసింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ యుద్ధ రీతి.. వాజ్పేయి నిర్భీతి దేశాన్ని సగర్వంగా నిలిపాయి. అంతటి అమెరికన్ సైతం తలవంచేలా చేశాయి. ఇంతకీ నాడు ఏం జరిగింది.. ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారు.. వాజ్పేయి ఆమె నాయకత్వాన్ని ఎలా సమర్థించారు.. అంతిమంగా భారతదేశం ఎలా లాభపడింది.. పాకిస్తాన్ ఎలా తలవంచింది..
Also Read: ట్రంప్ మధ్యవర్తిత్వం సరే.. ఆపరేషన్ సింధూర్ నుంచి భారత్ ఏం తెలుసుకోవాలి?
అమెరికాను ఈడ్చి కొట్టినట్టు సమాధానం చెప్పారు
” భారతదేశం గురించి మేము చాలా విన్నాం. కాకపోతే ఆ దేశానికి సరిహద్దున ఉన్న పాకిస్తాన్ విషయంలో వేలు పెట్టకూడదు. వేలు పెడితే మేము నిశ్శబ్దంగా ఉండలేము. దీనికి తగ్గట్టుగానే మా నుంచి ప్రతిస్పందన ఉంటుంది” అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ చేసిన వ్యాఖ్యలు అవి.. దానికి ఇందిరా గాంధీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ” అగ్రరాజ్యాన్ని మేము ఒక స్నేహితుడిగా మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నాం. అమెరికా మాకు ఎప్పటికీ యజమాని కాదు. ఇండియా తన భవిష్యత్తును ఎలా నిర్దేశించుకోగలదో కొత్తగా మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి ఎలా ఉండాలో.. ఎలా వ్యవహరించాలో మాకు కొత్తగా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని” ఇందిరాగాంధీ బదులిచ్చారు..
శ్వేత సౌధం లో భేటీ
నాడు ఇరు దేశాల అధినేతల మధ్య ఈ స్థాయిలో పరస్పర మాటల యుద్ధం జరిగిన తర్వాత.. అమెరికాలోని శ్వేత సౌధంలో నిక్సన్, ఇందిరా గాంధీ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణలు జరిగాయి. అనంతరం జరగాల్సిన విలేకరుల సమావేశాన్ని ఇందిరాగాంధీ బహిష్కరించారు. పట్టలేని ఆగ్రహంతో ఒకరకంగా సివంగి లాగా బయటికి వచ్చారు. ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెన్రీ క్రిస్సింజర్ కారు దాకా వచ్చారు. ” మీరు అనవసరంగా తొందరపడ్డారు. అమెరికా అధ్యక్షుడు తో కాస్త నిదానంగా మాట్లాడాల్సి ఉండేది” అని ఆమెకు సలహా ఇచ్చారు..” మీరు ఇచ్చిన ఉచితమైన సలహాకు ధన్యవాదాలు. మేము డెవలప్డ్ కంట్రీగా ఉన్నాం. ఇటువంటి సమయంలో మా మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడే సత్తాను కూడా కలిగి ఉన్నాం. మాకు బలం ఉంది. దృఢమైన వ్యక్తిత్వం కూడా ఉంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి మరొక దేశాన్ని రూల్ చేయగలిగే స్ట్రెంత్ మీకు లేదని.. దానిని నేను రుజువు చేస్తానని” ఇందిరా గాంధీ బదులిచ్చారు. ఇదే విషయాన్ని హెన్రీ తన ఆత్మ కథలో ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇందిరా గాంధీ హడావిడిగా వచ్చారు
ఇక అమెరికా నుంచి ఇందిరాగాంధీ హడావిడిగా ప్రత్యేకమైన విమానంలో వచ్చారు. విమానం నుంచి దిగగానే నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయిని తక్షణం తన ఇంటికి పిలిపించుకున్నారు. ఇద్దరు గంటసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వాజ్పేయి వెళ్లిపోయారు. ఐక్యరాజ్యసమితిలో వాజ్పేయి మాట్లాడాలని ఇందిరా గాంధీ సూచించడంతో.. ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఒక విలేఖరి ” మీరు, ఇందిరా గాంధీ బలమైన ప్రత్యర్థులు. ఆమె ప్రభుత్వ విధానాన్ని సమర్థించి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం ఎలా చేస్తారని” వాజ్పేయిని ప్రశ్నించారు.. దానికి ” ఒక గార్డెన్ లో ఒక చామంతి ఉంది.. మరో బంతి కూడా ఉంది. రెండు పూలు కూడా పరస్పరం నేను మాత్రమే అందమైనవి అనుకుంటే. తోట ఇబ్బందుల్లో పడినప్పుడు.. తోట అందాన్ని కాపాడాలి అంటే అవి రెండు ఒకే గాటిన చేరాలి. ప్రస్తుతం తోట సంక్షోభంలో పడింది. ఆ తోటను కాపాడేందుకు నా వంతు బాధ్యతగా నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇది తోట మాత్రమే కాదు మా దేశ డెమోక్రసీ కూడా అని” వాజ్పేయి సమాధానం చెప్పారు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వాజ్పేయి మాట్లాడిన తర్వాత.. కొద్ది రోజులకు అమెరికా పాకిస్తాన్ దేశానికి 270 పాటన్ ట్యాంక్ లు పంపించింది. ప్రపంచ మీడియాకు ఈ దృశ్యాలను చూపించింది. భారతదేశానికి ఏ దేశం కూడా సహాయం చేయద్దని ఒక రకంగా ఇన్ డైరెక్ట్ హెచ్చరికలు పంపించింది. కాదు భారతదేశానికి చమరు సరఫరా చేసే అమెరికా కంపెనీ బర్మా షెల్ పై ఒత్తిడి తీసుకొచ్చి .. చమురు ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపింది. ఇక ఆ తర్వాత ఇందిరా గాంధీ అమెరికాకు ఎదురు తిరిగారు. ఆమె అద్భుతమైన దౌత్య నీతి చూపించి ఉక్రెయిన్ నుంచి చమురు సరఫరా అయ్యేలా చూశారు. పాకిస్తాన్తో యుద్ధం వల్ల అమెరికా పంపించిన ట్యాంకులను భారత్ బద్దలు కొట్టింది. నేటికీ రాజస్థాన్లోని ఎడారులు ఆ బద్దలైన ట్యాంకులకు సాక్షులుగా ఉంటాయి. నాటి యుద్ధం 18 రోజులపాటు జరిగింది. 1.5 లక్షల పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను భారత్ పట్టుకుంది. ఇక అదే సమయంలో లాహోర్ జైలు నుంచి ముజిబుర్ రెహమాన్ విడుదలయ్యారు. ఇకమార్చి నెలలో బంగ్లాదేశ్ ను స్వాతంత్ర దేశంగా ఇందిరాగాంధీ గుర్తించారు. పార్లమెంట్లో సగర్వంగా ప్రకటన చేశారు. ఇక అదే సమయంలో పార్లమెంట్లో ఉన్న వాజ్పేయి ఇందిరాగాంధీని నడిచి వచ్చిన “దుర్గామాత” అని సంబోధించారు.