Money: ఆమెకు ఇప్పటికీ అన్యాయమే.. ‘హోం’ మినిస్టర్‌.. ఫైనాన్స్‌లో చాలా వీక్‌!

పురుషాధిక్య సమాజం మనది. కానీ మారుతున్న కాలంతో పాటు మహిళలూ మారుతున్నారు. తాము ఎక్కడా తక్కువ కాదన్నట్లు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం వాళ్లు ఇప్పటికీ వీకే.

Written By: Raj Shekar, Updated On : August 19, 2024 12:00 pm

Money

Follow us on

Money: ఇండియాలో ఒకప్పటికీ ఇప్పటికీ మహిళల్లో చాలా మార్పు వచ్చేసింది. ప్రస్తుతం వారు లేని రంగం లేదు. చేయని పనీ లేదు. మగవారిని మించి మరీ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు. అంతరిక్షమే వారి హద్దుగా మారింది. ఇక మన దేశంలో రకరకాల గణాంకాలు ఉంటాయి. ఆ స్టాటిస్టిక్స్‌ ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ఇండియా ఇప్పటికీ పురుషాధిక్య సమాజమే అనేందుకు తాజాగా ఒక ఉదాహరణ తెరపైకి వచ్చింది. మామూలుగా అయితే.. భారీగా మనీ సంపాదిస్తూ, తమ అకౌంట్లలో పెద్ద ఎత్తున మనీ పోగేసుకోవాలి. కానీ వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. మహిళల అకౌంట్లలో మనీ లేదు. చాలా తక్కువగా ఉందని తెలిసింది. మగవాళ్లతో పోల్చితే, మహిళలు బాగా పొదుపు చేస్తారు. ఈ రోజుకన్నా.. రేపటికే ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. పిల్లల పోషణ, వారి కెరీర్‌ గురించి మహిళలు ఎక్కువగా ఆలోచిస్తారు. దీంతో ఎన్నో త్యాగాలు చేస్తూ, మనీ సేవ్‌ చేస్తారు. ఐతే.. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ తీసిన లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. మెన్‌ అండ్‌ ఉమెన్‌ పేరుతో ఎన్‌ఎస్‌వో ఈ రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని బ్యాంక్‌ ఖాతాల్లో.. ఎక్కువ డబ్బు.. మగవాళ్ల అకౌంట్లలోనే పోగై ఉంది. మహిళల ఖాతాల్లో కేవలం 21 శాతమే ఉంది. దేశంలోని మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 20.8 శాతం లేదా దాదాపు 5వ వంతు మహిళా ఖాతాదారులకు చెందినదిగా తెలిసింది. ఇండియాలో రూ.91.77 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉంటే వీటిలో 36.4 శాతం మహిళల చేతిలో ఉన్నాయి. దేశంలోని మొత్తం బ్యాంకు అకౌంట్లలో రూ.187 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, వాటిలో మహిళల అకౌంట్లలో కేవలం రూ.39 లక్షల కోట్లే ఉన్నాయి.

రిపోర్టు ఇలా..
దేశంలోని ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, నివాసితులు, నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఇలా అందరి బ్యాంకు అకౌంట్లనూ లెక్కలోకి తీసుకుని ఈ రిపోర్టును రూపొందించింది. దీని ఆధారంగా మహిళల చేతిలోకి ఇంకా చాలా మనీ రావాల్సి ఉంది. వారు మరిన్ని బ్యాంక్‌ అకౌంట్లను పెంచుకోవాల్సి ఉంది. భారీగా మనీ వారి అకౌంట్లలో పోగవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే మగవారి ఆధిపత్య ధోరణి తగ్గుతుంది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యత్యాసం..
ఇక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా తీసుకున్న లెక్కల్ని చూస్తే, పట్టణాల్లో మొత్తం డిపాజిట్లలో రూ.1.9 లక్షల కోట్లు అంటే 16.5 శాతం మాత్రమే మహిళలకు చెందినవి. అదే గ్రామాల్లో రూ.5.91 లక్షల కోట్లు అంటే 30 శాతం మహిళల అకౌంట్లు ఉన్నాయి. గ్రామాల్లో ఆల్‌మోస్ట్‌ డబుల్‌ ఉండటానికి కారణం.. కేంద్రం తెచ్చిన జన్‌ధన్‌ ఖాతాలే. ఐతే, ఈ అకౌంట్లలో చాలా వాటిని మహిళలు ఉపయోగించుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ అకౌంట్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అందువల్ల మహిళలు వీటిపై ఆసక్తి చూపట్లేదు. మొత్తంగా మహిళల అకౌంట్లలో మనీ తక్కువగా ఉందనే విషయం విచారకరమే. ప్రభుత్వాలు వారికి భారీగా మనీ వచ్చేలా చేయాల్సిన అవసరం ఉంది.