
మంది ఎక్కువైతే… మజ్జిగ పలుచన అవుతుందనే సామెత అందరికీ.. తెలిసిందే.. వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రతిపక్ష టీడీపీకి 20మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో చాలా మందిని వ్యాపారాలు.. ఇతర ఒత్తిళ్లకు గురిచేసి సైలెంట్ చేయడంతో వైసీపీ ప్రతినిధులకు తిరుగు లేకుండా పోయింది. అయితే ఇప్పడు వైసీపీలోని ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవడం మానేసింది వారి హైకమాండ్. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. మొన్నటి రిపబ్లిక్ డే వేడుకల్లో.. అధికారికంగా పాల్గొనే అవకాశాన్ని కూడా అధికారులు వారికి కల్పించలేదు. సీనియర్ మంత్రి అయిన ఆనంకు కూడా ఆ గౌరవం దక్కుండా పోయిందని.. మీడియా ముందుకు వచ్చారు కానీ.. మిగితా వారు ఇంకా భయపడుతున్నారు.
Also Read: ఎస్ఈసీపై పెద్దిరెడ్డి.. సజ్జల తిట్ల దండకం..
వైసీపీ ఎమ్మెల్యేలను హైకమాండ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు చేస్తున్న విన్నపాలు ఇప్పడు బుట్టదాఖలు అవుతున్నాయి. కనీసం వారి పరిధిలోని గ్రామాల్లో వేసే రోడ్ల నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలం కావడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేసే కొన్ని పలనులు మాత్రం అతికష్టం మీద.. పార్టీకి పనికి వచ్చేవారికి అప్పగిస్తున్నారు. ఇక్కడ ఆశించేవారు ఎక్కువగా ఉండడంతో సమస్యలు వస్తున్నాయి. నిధులతో సంబంధం లేని పనులు.. సన్నిహిత అధికారుల పోస్టింగుల విషయంలోనూ.. వారికి ఇబ్బందులే.. బాధ చెప్పుకుందామనుకున్నా.. ఎవరూ అందుబాటులో ఉండని పరిస్థితి…
సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయకపోవడంతోనూ ఎమ్మెల్యేలకు తలవంపుగా మారింది. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వడం లేదని.. తానెక్కడి నుంచి తేవాలని ధర్మవరం ఎమ్మెల్యే.. వెంకట్రామిరెడ్డి.. తన వద్దకు వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తికి చెప్పిన విషయం.. ఇప్పడు సంచలనంగా మారింది. సదరు ఎమ్మెల్యే.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. కానీ తన నియోజకవర్గంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ అందించడంలో విఫలం అవుతున్నారు. కొన్నివేల దరఖాస్తులు సీఎంఆర్ఎఫ్ లో పెండింగులో ఉండిపోయాయి. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ సాయం కోసమే ఎమ్మెల్యేల వద్దకు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఏపీలో ప్రస్తుతం వారికి సాయం చేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉండిపోయారు.
Also Read: పీఆర్సీ పై కేసీఆర్ స్కెచ్ ఇదేనా..?
ఓ వైపు ముఖ్యమంత్రి సమయం ఇవ్వరు. గతంలో అయితే కనీసం విజయసాయి.. సజ్జల లాటి వారైనా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు సజ్జల సీఎంతో పాటు బిజీగా ఉన్నారు. విజయసాయి ఉత్తరాంధ్రాకే పరిమితం అయ్యారు. అక్కడి ఎమ్మెల్యేలు కూడా సజ్జల వైపే చూడాల్సిన పరిస్థితి. అభివృద్ధికి నిధులు రావు. కార్యకర్తలకు పని చేయలేని పరిస్థితి.. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలంతా.. మౌనంగా అన్నీ భరిస్తున్నారు. ఆనం లాంటివారు మరికొంత మంది అయినా బయటకు వస్తేనే.. హై కమాండ్ వారి సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్