https://oktelugu.com/

మూడో వేవ్: 19 వరకు లాక్ డౌన్

  కరోనా ముప్పు వెంటాడుతూనే ఉంది. రెండో దశ తగ్గిపోయిందని భావిస్తున్న తరుణంలో అప్పుడే మూడో దశ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ లక్షణాలు కనిపించడంతో మరోసారి లాక్ డౌన్ విధించింది. భారీ సడలింపులతో జులై 19 వరకు లాడ్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ పొడిగించినప్పటికి భారీగా సడలింపులు కల్పించారు. ఇందులో భాగంగా రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ దుకాణాలు మరో గంట పాటు నిర్వహించుకోవచ్చు. 50 […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 11, 2021 8:33 am
    Follow us on

     

    కరోనా ముప్పు వెంటాడుతూనే ఉంది. రెండో దశ తగ్గిపోయిందని భావిస్తున్న తరుణంలో అప్పుడే మూడో దశ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ లక్షణాలు కనిపించడంతో మరోసారి లాక్ డౌన్ విధించింది. భారీ సడలింపులతో జులై 19 వరకు లాడ్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ పొడిగించినప్పటికి భారీగా సడలింపులు కల్పించారు.

    ఇందులో భాగంగా రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ దుకాణాలు మరో గంట పాటు నిర్వహించుకోవచ్చు. 50 శాతం కస్టమర్లతో రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఏసీ వినియోగించుకునే కార్యాలయాల్లో తగిన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు వహించాలని సూచించింది. కరోనా మహమ్మారి ముప్పును తప్పించుకునేందుకు ప్రజలు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.

    కొవిడ్ రెండో దశ తీవ్రత తగ్గిన దరిమిలా సినిమా థియేటర్లకు సడలింపులు లభిస్తాయని అంతా భావించినా ప్రభుత్వం మాత్రం అనుమతించలేదు. స్కూళ్లు, కాలేజీలు, బార్లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జూలు మూసే ఉంటాయని తెలిపింది. సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు అనువతులు లేవని స్పష్టం చేసింది. పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మించరాదని నిబంధనలు విదించింది.

    తమిళనాడులో శనివారం కొత్తగా 2,913 కొత్త కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ర్టవ్యాప్తంగా 25.14 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 24.49 లక్షల మందికి పైగా కోలుకోగా, 33,371 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 32,7674 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ముప్పు తొలగించుకునేందుకు ప్రజలు నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించి నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.