https://oktelugu.com/

ఆ టీవీ చానళ్ల నుంచి రఘురామకు డబ్బులా?

టీడీపీ అనుకూల చానళ్లతో టీడీపీ కుమ్మక్కై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో సంచలన అఫిడివిట్ ను జగన్ సర్కార్ దాఖలు చేసింది. ఈ పరిణామం సంచలనమైంది. ఈ క్రమంలోనే టీవీ చానళ్లకు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య డబ్బు లావాదేవీలు కూడా జరిగాయని ఆరోపించింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇప్పటికే సీఎం జగన్ పై.. ప్రజా వ్యతిరేక చర్యలపైనా పోరాడుతున్నారు. ఆ చానళ్లలో రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామతోపాటు సదురు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2021 9:03 am
    Follow us on

    టీడీపీ అనుకూల చానళ్లతో టీడీపీ కుమ్మక్కై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో సంచలన అఫిడివిట్ ను జగన్ సర్కార్ దాఖలు చేసింది. ఈ పరిణామం సంచలనమైంది. ఈ క్రమంలోనే టీవీ చానళ్లకు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య డబ్బు లావాదేవీలు కూడా జరిగాయని ఆరోపించింది.

    వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇప్పటికే సీఎం జగన్ పై.. ప్రజా వ్యతిరేక చర్యలపైనా పోరాడుతున్నారు. ఆ చానళ్లలో రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామతోపాటు సదురు టీడీపీ చానెళ్లపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టింది. ఎంపీ రఘురామను అరెస్ట్ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టును ఎంపీ రఘురామ, చానెళ్లు ఆశ్రయించగా మీడియాపై దుందుడుకు చర్యలు వద్దని హెచ్చరించింది.

    ఈ కేసులో తాజాగా ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో సంచలన ఆరోపణలు చేసింది. రఘురామకు ఓ చానెల్ చైర్మన్ ఏకంగా 10 లక్షల యూరోలు (దాదాపు రూ.8.8 కోట్లు) బదిలీ చేసినట్లు తెలుస్తోందని.. అందుకు బదులుగా క్విడ్ ప్రోకో లో రఘురామరాజు తన పదవిని ఆయా న్యూస్ చానళ్ల వ్యక్తుల ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించింది.

    వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వంపై విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ముగ్గురు కుట్ర చేశారని ఏపీ ప్రభుత్వం ఆధారాలు సమర్పించినట్టు తెలిసింది.రఘురామరాజు, చంద్రబాబు, లోకేష్ మధ్య ఫోన్లలో జరిగిన సంభాషణలు, వారు షేర్ చేసుకున్న డాక్యుమెంట్లు ప్రజాస్వామికంగా ఎన్నికైన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద కుట్రను వెల్లడిస్తున్నాయని జగన్ సర్కార్ తమ అఫిడవిట్ లో ఆరోపించింది.

    రఘురామకృష్ణం రాజు నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. రఘురామకు సదురు చానెళ్ల యజమానుల నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్ లు కూడా అఫిడవిట్ లో పేర్కొంది.

    ఈ మొత్తం సేకరించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రజలను రెచ్చగొట్టి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ఉందని ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోందని ఏపీ ప్రభుత్వం సంచలన అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.