‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గ్యాప్ లేకుండా బన్నీ కూడా డేట్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హాట్ బ్యూటీ అనసూయ నటిస్తోంది. కాగా అనసూయ తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర పై స్పందిస్తూ.. ‘రంగస్థలం సినిమా తర్వాత మరోసారి మెమొరబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. రంగమ్మత్త పాత్రకు మించిన రెస్పాన్స్ ఇప్పుడు చేస్తోన్న పాత్రకు వస్తుంది’ అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది.
పనిలో పనిగా సుకుమార్ గురించి కూడా రెండు ముక్కలు మాట్లాడుతూ.. ‘సాధారణంగా సుకుమార్ గారు ఒకసారి పనిచేసిన వారితో, మరోసారి పని చేయరని విన్నాను. కానీ సుకుమార్ సర్, నాతో మళ్ళీ పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ మురిసి పోయింది అనసూయ. ఇక పుష్ప సినిమాలో అనసూయ పాత్ర గంజాయి అమ్ముకునే పాత్ర అట.
అలాగే గంజాయి అమ్ముతూ ఫారెస్ట్ ఆఫీసర్స్ కు తన తన వలపుల ఒయ్యారాలు పరిచయం చేసి వారిని ట్రాప్ చేస్తూ చంపిస్తోందట. ఒకరకంగా సినిమాలో ప్రధాన పాత్ర అట. మొత్తానికి అనసూయ క్రేజ్ ను పెంచుతూ ఆమె కోసం ప్రత్యేకంగా తన కథల్లో ప్రత్యేక పాత్రలను సృష్టిస్తున్నాడు సుకుమార్. ఏది ఏమైనా బుల్లితెర పై కామెడీ ప్రోగ్రామ్స్ తో కాలక్షేపం చేస్తోన్న ఆమెకు సుక్కు భారీ బ్రేక్ ఇచ్చాడనే చెప్పాలి.
పైగా ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరో కాబట్టి, ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి, ఈ సినిమాతో అనసూయ క్రేజ్ నేషనల్ రేంజ్ లో రైజ్ అవ్వడం ఖాయం. ఇక ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేస్తోంది అనసూయ.