Canada Vs India
Canada Vs India: జీ_20 కి ముందే నిజ్జర్ హత్య జరిగింది. దీనిని కెనడా ముందుగానే అమెరికా, కొన్ని దేశాలకు చెప్పింది. దీన్ని అడ్డుగా పెట్టుకొని రష్యా యుద్ధం చేయడం సరికాదని, ఆ దేశం తీరును తప్ప పడుతూ తీర్మానం చేయాలని భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కెనడా, అమెరికా ప్రయత్నించాయి. అని మోడీ తెలివిగా వారితోనే శాంతి ఒప్పందం చదివించాడు. ఆ తర్వాత కెనడా ప్రధానమంత్రి తన దేశం వెళ్లిన తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజ్జర్ హత్యకు గురికావడం ముమ్మాటికి భారత్ పనే అని అర్థం వచ్చేలా మాట్లాడాడు.. ఆ తర్వాత భారత్ కూడా భారత్ కూడా దీటుగానే స్పందించింది. ఈ క్రమంలో ఇరు దేశాల అధినేతలు దౌత్యవేత్తలను బహిష్కరించారు. దీనికి తోడు పన్నూన్ అనే ఖలిస్థానీ వేర్పాటు వాది కెనడాలోని హిందువులు భారత్ వెళ్లిపోవాలంటూ వివాదాస్పద వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరాయి.
పన్నూన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ దీటుగా బదులిచ్చారు. ఐక్యరాజ్యసమితిలో కొన్ని దేశాల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడో జరిగితే దానిని భారతదేశానికి ముడి పెట్టడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రపంచం బాగుండాలి అంటే అన్ని దేశాలు బాగుండాలని, సంపన్న దేశాలు మాత్రమే బాగుంటే అది అభివృద్ధి అనిపించుకోదని జై శంకర్ చురకలు అంటించారు. కెనడా విషయంలో భారత్ ఎప్పుడూ కూడా నిర్ణయాత్మక శక్తి గానే ఉందని, ఇదే సమయంలో తన అభివృద్ధికి కలిసి వచ్చే అవకాశాన్ని కూడా భారత్ వదులుకోదని జై శంకర్ స్పష్టం చేశారు. జై శంకర్ వ్యాఖ్యలు ఇలా ఉండగానే.. మోడీ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కాకపోతే ఈ పనులు ఖలిస్థానీ లను వెనకేసుకొస్తున్న కెనడా ప్రధానమంత్రి ట్రూడోకు, ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్, వేర్పాటు వాదాన్ని సమర్థిస్తున్న ఖలిస్థానీయులకు షాక్ తగిలేలా ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి ఈ కథనం రాసే సమయం వరకు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 53 చోట్ల ఏకకాలంలో “నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ”( ఎన్ ఐ ఏ) సంస్థ 53 చోట్ల దాడులు జరిపింది. పలువురిని అరెస్టు చేసింది. తుపాకులు, మందు గుండు సామాగ్రి, ఇతర ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వేర్పాటు వాద సాహిత్యాన్ని సీజ్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో జై శంకర్ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ దాడులు జరగడం విశేషం.
పాకిస్తాన్, కెనడా, మలేషియా, పోర్చు గల్, ఆస్ట్రేలియా దేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్థానీ వేర్పాటు వాదులకు సంబంధించిన ముఠాలు, గ్యాంగ్ స్టర్లు, డ్రగ్స్ మూకల పై ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది.” విదేశాలలో ఉన్న ఖలిస్థానీ వేర్పాటు వాదులు భారత్ లోని ప్రాంతాల్లో గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠాల్లో తమ అనుచరులను నియమించుకున్నారు. వారి ప్రోద్బలంతో నేరాలకు పాల్పడుతున్నారు. సుపారీ/ టార్గెట్ కిల్లింగ్ దందాలు చేస్తున్నారు. వీరికి ఆయుధాలు, సహాయం అందజేసేందుకు ఒక సిండికేట్ ఉన్నట్టు గుర్తించాం. ఈ నెట్వర్క్ ను కూకటి వేళ్లతో తీసివేసే క్రమంలో ఆరు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53 చోట్ల దాడులు చేశాం” అని ఎన్ఐఏ వివరించింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్ దల్లా తో హలో అన్న వారి ఇళ్లపై కూడా దాడులు చేసింది.. వీరిలో గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్ వంటి వారు ఉన్నట్టు తెలిసింది. పంజాబ్లో మహారాష్ట్రకు చెందిన బిల్డర్ సంజయ్ బియాని, మైనింగ్ ట్రేడర్ మెహల్ సింగ్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నాగల్ అంబియా హత్యలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది.
Recommended Video:
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Modis return gift to canadas trudeau
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com