తెలంగాణలో భూకంప ప్రకంపనలు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. నగరంలోని బోరుబండలో వరుసగా భూమి కంపించనట్లు అనిపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జాగారం చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది కాలనీ వాసులు ఇతర ప్రదేశాలకు వెళ్లారు. శనివారం ఉదయ శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లడం లేదు. అయితే 2017లో ఇదే తరహా శబ్దాలు వినిపించాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల బృందం శనివారం ఈ ప్రాంతంలో పర్యటించనుంది. సూర్యపేట జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.