వ్యాక్సిన్లపై సంచలన ప్రకటన దిశగా మోడీ?

ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి రెడీ అయ్యారు. సోమవారం సాయంత్రం దేశ ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రసంగంలో మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. వ్యాక్సిన్లపైనే కీలక నిర్ణయం తీసుకునే దిశగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని తెలుస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉధృతి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాక్సిన్ల విధానం, టీకాల కొరతపై […]

Written By: NARESH, Updated On : June 7, 2021 4:57 pm
Follow us on

ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి రెడీ అయ్యారు. సోమవారం సాయంత్రం దేశ ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రసంగంలో మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. వ్యాక్సిన్లపైనే కీలక నిర్ణయం తీసుకునే దిశగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని తెలుస్తోంది.

దేశంలో కరోనా రెండో దశ ఉధృతి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

వ్యాక్సిన్ల విధానం, టీకాల కొరతపై రాష్ట్రాలు, నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగం ఆసక్తి రేపుతోంది. ఇక టీకా ధరలు, వ్యాక్సిన్ పంపిణీపై ఇటీవల సుప్రీంకోర్టు సైతం కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఫార్ములాను జాతీయ చేయడం.. దేశంలో టీకాల కొరతను తీర్చేందుకు విదేశీ టీకాల దిగుమతికి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. విదేశీ టీకాలకు మినహాయింపులు ఇచ్చి దిగుమతి చేసుకునేలా మోడీ స్పష్టమైన ప్రకటన చేస్తారని అంటున్నారు. అంతేకాకుండా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మూడో దశ ఉధృతిపై కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.