కరీంనగర్ లో మనిషిలా అరుస్తున్న పాము? నిజమిదీ

కలియుగంలో వింతలు, విశేషాలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి ఏనాడో చెప్పారు. ఆయన చెప్పిన వాటిలో చాలా జరిగాయి. అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ వింతను చూద్దాం. జిల్లాలోని రామడుగు మండలం వెలిశాల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఓ వింత పాము సంచరిస్తోంది. అది విచిత్రమైన అరుపులు చేస్తోంది. అచ్చం మనిషిలా శబ్దం చేస్తోంది. అందరూ వింతగా చూస్తున్నారు. వీరబ్రహ్మం చెప్పిన విషయాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా అదే కోవలోకి వస్తుందని భయపడుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : June 7, 2021 6:06 pm
Follow us on

కలియుగంలో వింతలు, విశేషాలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి ఏనాడో చెప్పారు. ఆయన చెప్పిన వాటిలో చాలా జరిగాయి. అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ వింతను చూద్దాం. జిల్లాలోని రామడుగు మండలం వెలిశాల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఓ వింత పాము సంచరిస్తోంది. అది విచిత్రమైన అరుపులు చేస్తోంది.

అచ్చం మనిషిలా శబ్దం చేస్తోంది. అందరూ వింతగా చూస్తున్నారు. వీరబ్రహ్మం చెప్పిన విషయాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా అదే కోవలోకి వస్తుందని భయపడుతున్నారు. కలియుగానికి అంతం వచ్చిందని నమ్ముతున్నారు. వింతలు, విశేషాలు చోటుచేసుకున్నప్పుడు ప్రజలు ఈ విధంగా చెబుతుంటారు.

ఇది కావాలని ఆకతాయిలు కావాలని వాట్సాప్ గ్రూపులలో వైరల్ చేశారని తెలిసింది. అయితే ఆపాము తనకు కనబడినట్లు , తాను చూశానని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెబుతున్నాడు. అయితే ఈ వీడియో నెల రోజుల క్రితం మిల్క్ మెట్రిన్అనే యూట్యూబ్ చానల్ లో సింగిల్ స్నేక్ స్టైక్స్ అగైన్ అనే పేరుతో అప్ లోడ్ అయింది. దాన్ని డౌన్ లోడ్ చేసిన ఆ వ్యక్తి వీడియోని వైర్ చేశాడు. దీన్ని ఎవరు నమ్మవద్దని అధికారులు అంటున్నారు.

వీడియోని డౌన్ లోడ్ చేసిన ఆకతాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇది కరీంనగర్ కు చెందింది కాదని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సోమవారం ఈ వీడియో అన్ని చానళ్లలో ప్రసారం కావడంతో అందరికి తెలిసింది. అందరు వీడియోని డౌన్ లోడ్ చేసుకుని వింతగా చూస్తున్నారు