
తెలంగాణ సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై తొలి నుంచి ఇంట్రెస్టు ఉందనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యాక కూడా సీఎం కేసీఆర్ పలుమార్లు జాతీయ రాజకీయాలపై ఆసక్తికర ప్రకటనలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంపై పోరాడుతానని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో పలు రాష్ట్రాల సీఎంలను కలుసుకొని ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించారు. అయితే అది ఆచరణలోకి మాత్రం రాలేదు.
Also Read: హరీష్ మార్క్ పాలి‘ట్రిక్స్’: దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుస్తుందా?
అయితే కేసీఆర్ మనస్సులో మాత్రం జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్టు తగ్గలేదని తాజా పరిణమాలు మరోసారి నిరూపించాయి. ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీకి సాధ్యంకానీ పనిని టీఆర్ఎస్ చేసి చూపించింది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు మోడీ సర్కార్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక దేశ రాజధానిలో సొంతంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోయే రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ రికార్డు సృష్టించనుంది.
దేశంలో ప్రాంతీయ పార్టీల హవా మొదలై నాలుగు దశాబ్దాలు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో కేరాఫ్ ఆఫీసు లేకపోవడం గమనార్హం. ఈ పార్టీలన్నీ కూడా ఆయా ఎంపీలకు కేటాయించే ఇళ్లలోనే రీజనల్ పార్టీలను ఇప్పటిదాకా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు మాత్రమే సొంత కార్యాలయాలున్నాయి.
జాతీయ పార్టీలుగా చెప్పుకునే టీడీపీగానీ.. ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకిగానీ సొంత పార్టీలు లేవు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం చెప్పుకునే ఏ పార్టీలకు కూడా ఢిల్లీలో పార్టీ కార్యాయాలు లేకపోవడం గమనార్హం. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొనే తొలి పార్టీగా రికార్డు సృష్టించనుండటం గమనార్హం.
Also Read: తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ మరో వరం!
మోదీ అండతోనే టీఆర్ఎస్ ఢిల్లీలో పాగావేసేందుకు రెడీ అవుతుందనే టాక్ విన్పిస్తోంది. ఇక జాతీయ పార్టీలో చక్రం తిప్పుతాననే మాజీ సీఎం చంద్రబాబుకు ఇది అవమానంగా మారనుంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ చాణిక్యానికి ఇదొక మచ్చుతునక అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.