PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంలో కొత్త పంథా ఎంచుకున్నారు. త్వరలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు. దీంతో ఏ ప్రధాని చేయని కొత్త పనులు చేపడుతున్నారు. పరిపాలనలో కూడా కొత్త పోకడలు సృష్టిస్తున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పై కూడా ఓ కన్ను వేశారని ప్రచారం సాగుతోంది. నూతన సంవత్సర వేడుకలను అందుకు వేదికగా చేసుకున్నారు. తిరుమల తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల పూజారులను ఢిల్లీకి పిలిపించుకుని వారీ ఆశీర్వచనాలు తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. స్వామి వారి వస్ర్తం కప్పుకున్నారు.
ఇదంతా చూస్తుంటే ప్రధాని తన శైలి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దైవభక్తికి పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. ఎన్నడు లేనిది తిరుమల, శ్రీశైల దేవస్థానాల పూజారులను పిలిపించుకుని వారి చేత తీర్థ ప్రసాదాలు స్వీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ప్రధాని ఉద్దేశం ఏమిటి? భక్తి పారవశ్యమా? ఏపీ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read: 21 ఏళ్ల వివాహ చట్ట సవరణ: పెద్దఎత్తున ఆడపిల్లలకు పెళ్లిళ్లు.. గడువుకంటే ముందే కానిచ్చేస్తున్నారు!
గతంలో కూడా ఆయన తిరుమలకు తప్ప శ్రీశైలం వెళ్లలేదు. మల్లికార్జున స్వామిని దర్శించుకోలేదు. కానీ తీర్థ ప్రసాదాలు మాత్రం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. అన్ని రాజకీయ పక్షాలు ఇందులో ఏముందో అనే మీమాంసలో పడిపోయాయి. ప్రధాని ఏది చేసినా సంచలనమే. ప్రస్తుతం రెండు దేవస్థానాల తీర్థ ప్రసాదాలు స్వీకరించడంలో కూడా ఏదో మర్మం దాగి ఉందనే అభిప్రాయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాల్లోనే సరికొత్త సంప్రదాయాలకు తెర లేపడం మోడీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎన్నో వింతైన విషయాలపై దృష్టి సారించి అందరిని ఔరా అనిపించుకున్న ఘనత ఆయనదే. కానీ ప్రస్తుత భక్తి పారవశ్యంపై అందరిలో ఒకటే అనుమానాలు వస్తున్నాయి. వినూత్న సంప్రదాయానికి తెర లేపడంపై నేతల్లో సంశయాలు నెలకొన్నాయి. ఏదిఏమైనా ప్రధాని తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని ఏపీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: అమెరికాను కాదని భారత్ రష్యా వైపునకు ఎందుకు మొగ్గు చూపుతోంది..?