https://oktelugu.com/

Congress Politics: రేవంత్ రెడ్డి కథ క్లైమాక్స్ కు వచ్చిందా? తెరవెనుక ఏం జరుగుతోంది?

Congress Politics: కాంగ్రెస్ ను ఎవరో వచ్చి ముంచాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారన్న సామెత ఉంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అదే నిజమవుతోంది. కప్పెల తక్కెడలో ఏ కప్పు దాన్నుంచి బయట పడకుండా కింది కప్పలు లాగేస్తావన్న నానుడిని నిజం చేస్తూ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకుండా కాంగ్రెస్ సీనియర్లు ఎంత రాజకీయం చేశారో మనం చూశాం. ఇఫ్పుడు పీసీసీ చీఫ్ అయ్యాక కూడా కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిని వదలడం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2022 / 10:40 AM IST
    Follow us on

    Congress Politics: కాంగ్రెస్ ను ఎవరో వచ్చి ముంచాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారన్న సామెత ఉంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అదే నిజమవుతోంది. కప్పెల తక్కెడలో ఏ కప్పు దాన్నుంచి బయట పడకుండా కింది కప్పలు లాగేస్తావన్న నానుడిని నిజం చేస్తూ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకుండా కాంగ్రెస్ సీనియర్లు ఎంత రాజకీయం చేశారో మనం చూశాం. ఇఫ్పుడు పీసీసీ చీఫ్ అయ్యాక కూడా కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిని వదలడం లేదు. జగ్గారెడ్డి, చిన్నారెడ్డి వంటి నేతలు అసమ్మతి రాజేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణ‌ కాంగ్రెస్ లో వ‌ర్గ‌పోరు కొన‌సాగుతోంది. టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా పార్టీ అధిష్టానానికి లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయంశంగా మారింది. జ‌గ్గారెడ్డి అంత ధైర్యం ఎందుకు చేశారు..? రేవంత్ ప్ర‌వ‌ర్త‌న ఈయనకు న‌చ్చ‌లేదా.. ఆయ‌న వెనుక ఎవరైనా ఉన్నారా..? ఎవరా నాయ‌కులు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు దిగ‌జార్చుతున్నారనే దానిపై స్పెషల్ స్టోరీ..

    Jagga-Reddy-Revanth

    తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీలో ఉన్న సీనియ‌ర్ల‌ను కాద‌ని, పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డంతో గ‌తంలోనే పెను దుమారం రేగింది. పార్టీ అధిష్టానం నిర్ణ‌యంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంతురావు, భ‌ట్టీ విక్రమార్క, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పార్టీ కోసం ప‌ని చేస్తున్న సీనియ‌ర్ల‌కు బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా కొత్త‌వారి ఇవ్వ‌డం ఏంట‌ని పార్టీ సీనియ‌ర్ నేత హ‌నుమంతురావు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను ప్ర‌శ్నించారు. మ‌రోవైపు రేవంత్ రెడ్డి ద‌గ్గ‌ర మ‌ణిక్కం ఠాగూర్ డ‌బ్బులు తీసుకొని అత‌నికి టీపీసీసీ బాధ్య‌త‌లు ఇప్పించిన‌ట్లు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇది అప్ప‌ట్లో పెను దుమారం రేపింది.

    Also Read:  సొంత మీడియా ఏర్పాటుకు రేవంత్ రెడ్డి రెడీయేనా?

    రేవంత్ రెడ్డి పార్టీ అధ్య‌క్ష బాధ్య‌తలు చేప‌ట్టిన అప్ప‌టి నుంచి టీపీసీసీ చీఫ్ మీటింగ్ ల‌కు సీఎల్పీ నేత భట్టీ విక్ర‌మార్క, ఎంపీ కోమ‌టి రెడ్డి దూరంగా ఉంటున్నారు. మ‌రోవైపు రేవంత్ రెడ్డి ఎలాంటి స‌మావేశాలు ఏర్పాటు చేసినా త‌న‌కు ఆహ్వానం అంద‌డం లేద‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ విధి విధానాలు గాలికొదిలేసి.. రేవంత్ రెడ్డి త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జ‌గ్గారెడ్డి విమ‌ర్శించారు. పార్టీలో ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోని రేవంత్ రెడ్డి  స్టార్ లీడ‌ర్ గా ఎద‌గాల‌ని చూస్తున్నార‌న్నారు.

    రేవంత్ రెడ్డిపై జ‌గ్గారెడ్డి బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డం, రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయంశ‌గా మారింది. జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు తాను స్వ‌త‌హాగా చేయ‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది. జ‌గ్గారెడ్డి వెనుకాల పార్టీ సీనియ‌ర్లు ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

    ఇదే అదునుగా భావించిన పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ్గారెడ్దికి దగ్గ‌ర‌య్యార‌ని రాజ‌కీయ్య విశ్లేష‌కులు భావిస్తున్నారు. పార్టీలో త‌మ‌కు అధిష్టానం స‌ముచిత స్థానం కల్పించ‌క‌పోవ‌డంతో.. పార్టీ సీనియ‌ర్లు, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టీ విక్ర‌మార్గలు… జ‌గ్గారెడ్డితో రేవంత్ పై ఆరోప‌ణ‌లు చేయిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎలాగైనా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి తొల‌గించి ఆ ప‌ధ‌వి త‌మ‌కు వ‌చ్చే విధంగా సీనియ‌ర్ నాయ‌కులు అడుగులు వేస్తున్న‌ట్లు పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు.

    రేవంత్ రెడ్డి దూకుడు.. సీనియర్లను పక్కనపెడుతున్న తీరు వారిలో ఆగ్రహం తెప్పిస్తోంది. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించడం కూడా సీనియర్లకు కంటగింపుగా మారింది. ఇదే అదునుగా భావించి జ‌గ్గారెడ్డితో రేవంత్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయించార‌ని తెలుస్తోంది. రేవంత్ ను చేయకుండా  అడ్డుపడుతూ పార్టీ నేత‌లు అంద‌రూ క‌లిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితిని ద‌ారుణంగా త‌యారు చేస్తున్నార‌ని రాజకీయ విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు. పార్టీలో నేత‌లు ప‌ద‌వుల కోసం కొట్లాడుకుంటున్నారన్నారు. ఇప్ప‌టికైనా నేత‌లు ప‌ద‌వుల కోసం కాకుండా పార్టీ కోసం ప‌ని చేయాలంటున్నారు.

    మరోవైపు రేవంత్‌ రెడ్డి తెలంగాణ బీజేపీపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. దీంతో ఆయన బీజేపీ నేతలతో స్నేహపూరితంగా మొలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రాన్ని ఎండగట్టాల్సిన నేత వారితో దోస్తీ చేస్తుండటం కాంగ్రెస్ సీనియర్లకు సానుకూలాంశంగా చెప్పవచ్చు. దీంతో రేవంత్‌ రెడ్డిని ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల వద్ద ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.  రేవంత్‌ రెడ్డి కథ క్లైమాక్స్‌కు వచ్చిందనే వాదన వినిపిస్తోంది.

    Also Read:  జీవో 317కు సవరణ చేయాల్సిందే.. బండి సంజయ్