తొలి కాంగ్రెసేతర ప్రధాని..రికార్డ్ సృష్టించిన మోడీ

100 ఏళ్ల కాంగ్రెస్ ను ఎదుర్కొన్నాడు. కమలదళాన్ని నడిపించాడు. ఒంటిచేత్తో దేశంలో బీజేపీకి అధికారం తెప్పించాడు. పొత్తుల సంసారంలో కొట్టుమిట్టాడే భారత ప్రజాస్వామ్య చరిత్రలో రెండు సార్లు పూర్తి మెజారిటీతో బీజేపీని గద్దెనెక్కించి ప్రధాని కొలువులో కూర్చున్నాడు మోడీ. ఇప్పుడు స్వతంత్ర భారతంలోనే కొత్త ఘనతను సృష్టించాడు. Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం? ప్రధాని మోడీ కొత్త రికార్డ్ సృష్టించాడు. దేశంలో ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ […]

Written By: NARESH, Updated On : August 14, 2020 2:50 pm
Follow us on


100 ఏళ్ల కాంగ్రెస్ ను ఎదుర్కొన్నాడు. కమలదళాన్ని నడిపించాడు. ఒంటిచేత్తో దేశంలో బీజేపీకి అధికారం తెప్పించాడు. పొత్తుల సంసారంలో కొట్టుమిట్టాడే భారత ప్రజాస్వామ్య చరిత్రలో రెండు సార్లు పూర్తి మెజారిటీతో బీజేపీని గద్దెనెక్కించి ప్రధాని కొలువులో కూర్చున్నాడు మోడీ. ఇప్పుడు స్వతంత్ర భారతంలోనే కొత్త ఘనతను సృష్టించాడు.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

ప్రధాని మోడీ కొత్త రికార్డ్ సృష్టించాడు. దేశంలో ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ సంచలనం రేపారు.

ఇంతకాలం ఆ రికార్డ్ బీజేపీకి చెందిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరిట ఉంది.వాజ్ పేయి రెండు సార్లు దేశ ప్రధానిగా 2268 రోజులు పనిచేశారు. నరేంద్రమోడీ ఈ గురువారంతో దానిని అధిగమించారు.

ప్రస్తుత మన దేశ చరిత్రలో నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నాలుగో వ్యక్తిగా మోడీ రికార్డ్ సృష్టించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన ఘనత తొలి ప్రధాని నెహ్రూ సొంతం. ఆయన 16 ఏళ్ల 286 రోజుల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు.

ఇక ఇందిరాగాంధీ రెండోస్థానంలో ఉన్నారు. ఆమె 11 ఏళ్ల 59రోజులు దేశాన్ని పాలించారు. మన్మోహన్ సింగ్ మూడో వ్యక్తి. ఈయన 10 ఏళ్ల 4 రోజులు ప్రధానిగా సేవలందించారు.

Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?

వీళ్లందరి తర్వాత దేశ ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించింది మన నరేంద్ర మోడీనే.. దేశ ప్రధానిగా 2014 మే 26న మోడీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రెండోసారి కూడా 2019లో అఖండ మెజారిటీతో గెలిచి మే 30న రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాజ్ పేయి 5వ స్థానానికి పడిపోయాడు.

ఇక ఈ హయాంలో ముగిసేసరికి మోడీ ఖచ్చితంగా మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తారు. 10 ఏళ్లు పూర్తి చేసుకొని మన్మోహన్ సింగ్ ను అధిగమించే చాన్స్ ఉంది. ఇక వచ్చేసారి కూడా గెలిస్తే ఏకంగా నెహ్రూ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలందించిన ఘనతను మోడీ సొంతం చేసుకుంటారు. కానీ వచ్చే సారి ఏం జరుగుతుందనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికైతే మోడీ కాంగ్రెసేతరుల్లో నంబర్ 1 ప్రధానిగా నిలిచారు.

-ఎన్నం