తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకుల్లో దేవా కట్టా ఒకడు. సామాజిక, రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న దేవా.. వైవిధ్యమైన చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తొలి సినిమా ‘వెన్నెల’తోనే తనదైన ముద్ర వేసిన అతను.. ‘ప్రస్థానం’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినప్పటికీ ‘ఆటో నగర్ సూర్య’ కూడా ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ప్రస్థానం మూవీని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసిన అతను తాజాగా మరో సంచలన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య స్నేహం, రాజకీయ వైరం ఇతివృత్తంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. దీనికి ‘ఇంద్రప్రస్థం’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన దేవా కట్టా.. ఈ రోజు (శుక్రవారం) మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
Also Read: బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !
అభివాదం చేస్తున్న సీబీఎన్, వైఎస్‌ఆర్ షాడోస్‌తో కూడిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ పర్పస్ ఒక్కడే.. విన్నర్స్ ని ఎంచుకోవడం. విన్నర్స్ ప్రపంచాన్ని ఏలుతారు. అయితే ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే..! ఆ ఆటకున్న కిక్కే వేరు’ అంటూ దేవా కట్టా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పోస్టర్పై ‘ నైతికత మారుతుంది కానీ, అధికారం కోసం జరిగే యుద్ధం మాత్రం అలానే ఉంటుంది’ అని ఇంగ్లిష్‌లో ఉన్న కొటేషన్ ఆలోచింపజేసేలా ఉంది. సత్యానికి రెండు వైపులు ఉండవు. ఒకవైపు మాత్రమే ఉంటుంది అంటూ ‘ఇంద్రప్రస్థం’ పోస్టర్ను దేవ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరీష్, తేజ.సి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్‌తో చేసే సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుంది.
Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !
దేవా కట్టా రాసుకున్న ఈ ఫిక్షనల్ పొలికల్ థ్రిల్లర్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై ఇప్పటికే కొంత వివాదం మొదలైంది. ఏపీ రాజకీయాల స్పూర్తితో మూడేళ్ల క్రితమే తాను ఈ కథ రాసి, అనేక వెర్షన్స్‌ను రిజిస్టర్ చేయించానని దేవా తెలిపాడు. కానీ, ఈ కాన్సెప్ట్‌ను తస్కరించే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరిపై కొన్ని రోజుల కిందట ఆరోపణలు చేశాడు . ఎన్టీఆర్ బయోపిక్ కథ కూడా తనదే అని, దాన్ని కూడా తస్కరించారని ఆరోపించాడు. తన కథతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్‌గా తీశారని, మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానని చెప్పాడు. ఏదేమైనా చంద్రబాబు, వైఎస్‌ఆర్ రాజకీయ వైరం బహిరంగమే అయినా.. ఎవరూ టచ్ చేయని వాళ్ల స్నేహాన్ని దేవా కట్టా ఎలా తెరకెక్కిస్తాడన్నది ఆసక్తికరం.
There are no two sides to TRUTH, there is only one side!! Pls checkout the theme poster of INDRAPRASTHAM (working title)! @ProodosP @tchekuri @KrishnavijayL teaser score by #sureshbobbili https://t.co/mh0DZbY2VV
— deva katta (@devakatta) August 14, 2020