https://oktelugu.com/

దేశ భద్రతలో రాజీపడేది లేదన్న మోడీ

రూ.3,500 కోట్ల వ్యయం.. 9.02 కిలోమీటర్ల పొడవు.. సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున నిర్మించిన ఈ టన్నెల్‌ ప్రపంచంలోనే అతిపొడవైనది. మనాలీ నుంచి లాహోల్‌ స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. దీని వల్ల మనాలీ నుంచి లఢక్‌లోని లేహ్‌ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. పైగా… ఇది సొరంగం కావడం వల్ల దీంట్లోకి మంచు రాదు. దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు. అంతేకాదు లఢక్, […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 02:42 PM IST
    Follow us on

    రూ.3,500 కోట్ల వ్యయం.. 9.02 కిలోమీటర్ల పొడవు.. సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున నిర్మించిన ఈ టన్నెల్‌ ప్రపంచంలోనే అతిపొడవైనది. మనాలీ నుంచి లాహోల్‌ స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. దీని వల్ల మనాలీ నుంచి లఢక్‌లోని లేహ్‌ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. పైగా… ఇది సొరంగం కావడం వల్ల దీంట్లోకి మంచు రాదు. దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు. అంతేకాదు లఢక్, అక్సాయ్‌ చిన్‌ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది.

    Also Read: రాహుల్‌ ట్వీట్‌: హత్రాస్‌ కుటుంబాన్ని కలుస్తం.. మమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు..

    ఇంత చరిత్ర కలిగిన ఈ ‘అటల్‌ టన్నెల్‌’ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ టన్నెల్ పూర్తికావాలన్నది కేవలం అటల్ బిహారీ వాజ్‌పాయ్ కల మాత్రమే కాదని, హిమాచల్ ప్రదేశ్ ప్రజల కల కూడా అని ఆయన అన్నారు. ఇంత శక్తిమంతమైన, ముఖ్యమైన టన్నెల్ సరిహద్దుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠ పరుస్తుందని, కొత్త బలాన్ని చేకూరుస్తుందని ప్రకటించారు. కొత్త కొత్త సంస్కరణలను తేవడం ద్వారా సరికొత్త, అధునాతన ఆయుధాలు దేశంలోనే తయారు చేసుకోడానికి వీలవుతుందని అన్నారు.

    అంతేకాదు.. దేశ భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమని, అంతకంటే ముఖ్యమైన అంశం తమకు మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. అయితే రక్షణ రంగంలో రాజీపడ్డ ఘటనలను కూడా ప్రజలు చూశారని గత ప్రభుత్వాలపై మోదీ అన్యాపదేశంగా మండిపడ్డారు. సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ ఫలాలు కేవలం భద్రతా బలగాలకే అందవని, దేశంలోని సామాన్యులకు కూడా అందుతాయని ప్రకటించారు.

    Also Read: కేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి కాల్చారు

    ప్రపంచ స్థాయి సరిహద్దు కనెక్టివిటీకి ఈ టన్నెల్ ప్రారంభం ఓ ఉదాహరణగా నిలుస్తుందని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్‌లోని ‘కోసీ మహాసేతు’ నిర్మాణాన్ని కూడా వేగవంతంగా పూర్తిచేసి.. జాతికి అంకితం చేశామని గుర్తు చేశారు. చాలా తక్కువ వనరులున్నా దేశ జవాన్లు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా వివిధ యూనివర్శిటీలు ఈ టన్నెల్‌ను ఓ ‘కేస్ స్టడీ’ గా అధ్యయనం చేయాలని అందుకు విదేశాంగ శాఖ ఓ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. టన్నెల్‌ నిర్మాణం ప్రారంభించిన సమయంలో 2040 వరకు ఈ టన్నెల్‌ పూర్తవుతుందని చెప్పారని.. కానీ ఆరేళ్లలోనే పూర్తిచేసి చూపించామని చెప్పారు.