Homeఅత్యంత ప్రజాదరణకేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి కాల్చారు

కేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి కాల్చారు


అది ఓ ‘హత్యా’చారం కేసు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు కామాంధులకు బలైన యువతి కేసు. వెన్నెముకను విరగ్గొట్టి.. నాలుకను నలగ్గొట్టి.. ఒకరి తర్వాత ఒకరు రాక్షసానందం పొందిన కేసే. నాటి ‘నిర్భయ’ ఘటనను తలపిస్తున్న కేసు. అయినా ఈ కేసు.. ఒక సర్కారుకీ, రాజకీయ పక్షానికి పట్టడం లేదు.

Also Read: రాహుల్‌ ట్వీట్‌: హత్రాస్‌ కుటుంబాన్ని కలుస్తం.. మమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు..

హైదరాబాద్‌లోలాగా.. అత్యాచారం చేసి, చంపేశాక, రూపు రేఖలు తెలియకుండా నిందితులే దహనం చేసిన కేసు కాదు. చచ్చిందనో, చావక పోతుందా-అనో వదిలేసి వెళ్ళిపోయిన కేసు. అందుకే ఆ నలుగురిని ఎన్‌కౌంటర్‌‌ చేసే పరిస్థితులు లేవు. ఈ కేసుకు ఓ ‘దిశ’ అంటూ లేదు. కారణం ఒక్కటే చనిపోయిన ఆ యువతి దళిత కుటుంబానికి చెందడమే.

పదకొండేళ్ళ అమ్మాయి. పశుదాణా కోసం పొలానికి వెళ్తే.. ఠాకూర్‌‌ కులానికి చెందిన నలుగురు కామాంధులు ఆ యువతి మీద పడ్డారు. ఒక్కసారిగా ఆమె చుట్టుకున్న చున్నీనే ఆమె పీకకు చుట్టారు. కింద పడేశారు. ఏం చేయాల్నో కూడా తెలియని ఆ యువతి పరిస్థితి. తనను తాను రక్షించుకునేందుకు ప్రతిఘటిస్తూనే ఉంది. కానీ.. ఏం లాభం పాపం ఆడ జన్మ కదా. నలుగురు దుర్మార్గులు మీద పడ్డాక ఏం రక్షించుకోగలుగుతుంది. వారి శక్తిసామర్థ్యాలు ముందు ఈమె బలమెంత.

అయినా.. పోరాడింది. తన మానాన్ని, ప్రాణాలను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. పెనుగులాటలో చివరికి వెన్ను విరిగింది. అయినా పోరాడుతూనే ఉంది. చివరికి స్పృహ తప్పింది. ‘ఎవరైనా కాపాడండి.. ఈ కామాంధుల నుంచి బయటపడేయండి’ అంటూ ఎంత మొత్తుకున్నా ఆ కేకలు ఎవరికీ వినిపించలేదు. కొంచెం దూరంలో ఉన్న ఆ తల్లికి తప్ప.

ఈ ఘటన రెండు వారాల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌ జిల్లాలో జరిగింది. చట్టమంటే అపార గౌరవమున్న తల్లి నిస్సహాయ స్థితిలో, అపస్మారక స్థితిలో ఉన్న కూతురును తీసుకొని న్యాయం కోసం చాంద్‌ పా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని.. తన గోడును మొత్తం వెల్లబోసుకుంది. కానీ.. పోలీసులు నమ్మనే లేదు. పైపెచ్చు ఎగతాళి చేసినట్లు బాధిత కుటుంబసభ్యుల ఆరోపణ.

ముందు ఆలిగడ్‌లోని జవహర్‌ లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలలో చేర్పించినా, వెన్నెముక బాగా పాడవటంతో, ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ హాస్పటల్‌కు తరలించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌‌ 29న చనిపోయింది.పోస్టుమార్టం చేశారు. చివరికి రిపోర్టు రానే వచ్చింది. ఏమొచ్చింది.. ఏముంది అందులో అంటే.. ‘తీవ్రమైన ఒత్తడి వినియోగించడం వల్ల వెన్నెముకకు గాయమైంది. దీంతో చనిపోయింది’, అంతేకానీ ‘పీక నులమటం వల్ల చనిపోలేదు’ అంటూ ప్రైమరీ నివేదిక ఇచ్చారు. ఫైనల్‌ నివేదికలో అయితే విస్తుపోయేలా చెప్పుకొచ్చారు. ‘ఆమె మర్మావయాల్లో ఎప్పటివో చినిగిన జాడలు ఉన్నాయి. కానీ.. రేప్‌ మాత్రం జరగలేదు’ అని వెల్లడించారు.

Also Read: దేశ భద్రతలో రాజీపడేది లేదన్న మోడీ

ఈ వార్త ముందు ఛానెల్స్‌లో రాలేదు. కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం వైరల్‌ అయింది. దాంతో ఉత్తరప్రదేశ్‌ పౌర సమాచార అధికారులు అతిసులభంగా ఫేక్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారు. మనిషి చనిపోయాక పత్రికలకు కూడా అది వార్తే. పేపర్లలో వచ్చాక పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలి వద్ద సేకరించిన నమూనాల్లో ఎక్కడా ‘వీర్యపు’ జాడలు లేవని ధ్రువీకరించేశారు. అంతేకాదు. కేవలం ‘కుల పరమైన ఉద్రిక్తతలను’ పెంచటానికి ఈ ఘటనను కొందరు వాడుకుంటున్నారని ప్రత్యారోపణలు చేశారు. అలా చెప్పి నలుగురు నిందితుల్నీ అరెస్టు చేశారు. అది కూడా సామూహిక అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడ్డారని. అయితే ఇందులో ఒకణ్ణి మాత్రమే కొన్ని రోజుల ముందు అరెస్టు చేశారు.

సాధారణంగా, అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరు పరచటంతో పోలీసులు తమ బాధ్యత ముగిసిందనుకుంటారు. కానీ, ఇక్కడి పోలీసులు ‘అంతకు మించి’న ధర్మాన్ని నిర్వర్తించారు. చనిపోయిన బాలిక మృత దేహాన్ని కూడా ఉచితంగా ‘దహన’ పరిచారు. అది కూడా తెల్లవారితే 30వ తేదీ అనగా, అర్ధరాత్రి 2 గంటలకు కట్టెలు పేర్పించి కాల్పించారు. ఈ పనికి తమ అనుమతి లేదన్నది బాలిక కుటుంబ సభ్యుల అభియోగం. అంతే కాదు తమను ఇంటిలో బంధించి- ఈ పనికి పాల్పడ్డారని కూడా వారు అంటున్నారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ అభియోగాన్ని కొట్టి పారేస్తున్నారు. చివరగా కేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి తగలబెట్టారనేది అపవాదును మూటగట్టుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version