https://oktelugu.com/

చంద్రబాబుకు మోడీ రిటర్న్‌ గిఫ్ట్‌

రాజకీయాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌ అనే పదం ఎంత పాపులర్‌‌ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబును ఇది ఎంతటి నిద్రలో అడిగినా ఇట్టే చెబుతారేమో. ఏపీలో ఎన్నికలకు ముందు ఈ పదం ప్రజల్లోకి వెళ్లింది. చివరికి బాబు గారికి రిటర్న్‌ గిఫ్ట్‌ కూడా అందింది. Also Read: ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్రలకు బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు ఏపీలో గత ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ ఈ మాటను బాగా పాపులర్‌‌ చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 12:08 PM IST
    Follow us on

    రాజకీయాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌ అనే పదం ఎంత పాపులర్‌‌ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబును ఇది ఎంతటి నిద్రలో అడిగినా ఇట్టే చెబుతారేమో. ఏపీలో ఎన్నికలకు ముందు ఈ పదం ప్రజల్లోకి వెళ్లింది. చివరికి బాబు గారికి రిటర్న్‌ గిఫ్ట్‌ కూడా అందింది.

    Also Read: ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్రలకు బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు

    ఏపీలో గత ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ ఈ మాటను బాగా పాపులర్‌‌ చేశారు. ఎందుకంటే ఆయనే కదా చంద్రాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి, అతడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. చెప్పినట్టుగానే బాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. బాబు ఓడిన తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రిటర్న్ గిఫ్ట్ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ మరొకటి బాబుకు రెడీ అవుతోందట. ఈసారి ఈ రిటర్న్ గిఫ్ట్ ప్రధాని మోడీ నుంచి అందబోతోందట.

    2019 ఎన్నికల్లోనూ గెలుస్తాననే గర్వంతో ఉన్న చంద్రబాబు.. ఆ ఎన్నికల టైమ్‌లో ప్రధాని మోడీ ఇష్టం వచ్చినట్లుగా మాటలన్నారు. ఆయనపై వ్యక్తిగత కూడా విమర్శలు చేశారు. మోడీ భార్య పేరును కూడా రాజకీయాల్లోకి లాగి, మరింత దిగజారారు. ఇవన్నీ ఒకెత్తయితే.. పొత్తు నియమాల్ని పాటించకుండా సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకొని, వెన్నుపోటు రాజకీయాలకు తెరదీశారు. తిరుపతి వచ్చిన అమిత్ షా పై రాళ్లు వేయించారు.

    చంద్రబాబు చేసిన ఈ ద్రోహాలను మోడీ మరిచిపోలేదు. అంతేకాదు.. పార్టీకి ఏ స్థాయిలో వ్యతిరేకంగా పనిచేశారో కూడా ఆయన మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. మోడీ ఏవిషయాన్ని కూడా అంత ఈజీగా మరిచిపోయే టైప్‌ కూడా కాదు. టైం దొరకాలే కానీ.. వడ్డీతో సహా ఆ పరిహారం తీస్తారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ టైమ్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే.. చంద్రబాబుకు త్వరలోనే చంద్రబాబుకు తనదైన స్టయిల్‌లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ప్రధాని.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై కొనసాగుతున్న వివాదం.. రంగంలోకి ఆదివాసీలు..!

    పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి-అక్రమాలపై ఇప్పటికే ప్రధాని మోడీకి సీఎం జగన్‌ వివరించారు. దీనిపై తయారుచేసిన పూర్తి నోట్‌ను ప్రధానికి అందించినట్టు సమాచారం. ఇక పోలవరం లెక్కల్లో అవకతవకల్ని ఇప్పటికే పూర్తిస్థాయిలో కూపీలాగిన ఆర్థిక మంత్రి బుగ్గన కూడా తాజాగా దీనికి సంబంధించిన అవకతవకల వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందించినట్టు తెలుస్తోంది. సో.. ముందుగా పోలవరం ప్రాజెక్టు అవినీతిపైనే విచారణ సాగించేలా కేంద్రం రంగంలోకి దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబుకు మోడీ గిఫ్ట్‌ ఇచ్చినట్లే.