మారిటోరియం వడ్డీ మాఫీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

  దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ఆరు నెలల పాటు మారిటోరియం వినియోగించుకున్న వారికి చక్రవడ్డీ విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటి వరకు మారిటోరియం పథకం కింద రూ. 2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ మినహాయింపులు అమలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు రూ. 2 కోట్ల రూపాలయలకు […]

Written By: Suresh, Updated On : October 24, 2020 12:19 pm
Follow us on

 

దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ఆరు నెలల పాటు మారిటోరియం వినియోగించుకున్న వారికి చక్రవడ్డీ విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటి వరకు మారిటోరియం పథకం కింద రూ. 2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ మినహాయింపులు అమలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు రూ. 2 కోట్ల రూపాలయలకు మించని హౌసింగ్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు, వెహికిల్ లోన్ తీసుకున్న వారికి వడ్డ మాఫీ ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్ష్ కంపెనీలు వడ్డీ డబ్బులను రుణ గ్రహీత అకౌంట్లలో వేస్తాయని పేర్కంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. 6,500 కోట్ల భారం పడుతున్నట్లు తెలుస్తోంది.