Homeజాతీయ వార్తలుZojila Tunnel: పాక్, చైనా వెన్నులో వణుకు.. మోడీ చేసిన అద్భుతమిదీ

Zojila Tunnel: పాక్, చైనా వెన్నులో వణుకు.. మోడీ చేసిన అద్భుతమిదీ

Zojila Tunnel: ఇది మోడీ చేసిన అద్భుతం. మంచుకొండల్లో మానవ మహా నిర్మితం. ఇంతవరకు ఏ పాలకులు ఆలోచించలేదు. కనీసం అలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. నరేంద్ర మోడీ ఇదంతా గుర్తించి.. మంచుకొండల్లో సరికొత్త చరిత్రను సృష్టించారు. కొండలను తొలచి సరికొత్త సొరంగం నిర్మించారు. ఇది కాస్త చైనాలో.. పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ నరేంద్ర మోడీ చేసిన ఆ అద్భుతం ఏంటంటే..

శ్రీనగర్ నుంచి లద్ధాక్ వరకు దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 1 నిర్మించారు. ఇక్కడ శ్రీనగర్ నుంచి లద్ధాక్ వరకు ప్రయాణం సాగించాలంటే 13 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ వెళ్లాలి. అత్యంత శీతల వాతావరణం లో ప్రయాణం సాగించాలి. సుమారు 12 నుంచి 14 వరకు ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. శీతకాలంలో అయితే ఆరు నెలల పాటు ఈ రోడ్డు మూసి ఉంటుంది.

ముఖ్యంగా సోనా మార్గ్ ప్రాంతంలోని బాల్తాల్ నుంచి కార్గిల్ జిల్లా మీనా మార్గ్.. మధ్యలో కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. కానీ మంచు వల్ల ఈ ప్రయాణానికి నాలుగు గంటల వరకు పడుతుంది. ఏడాదిలో సగం రోజుల వరకు ఈ రోడ్డు మూతపడుతుంది. దీనికి ప్రధాన కారణం మంచు. దీనివల్ల పాకిస్తాన్, చైనాతో కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. యుద్ధాలు.. భారత సైన్యం సక్రమంగా వ్యవహారాలు సాగించడానికి వీలు లేకుండా పోవడం వల్ల అనేక రకాల కార్యకలాపాలు ఆగిపోతుంటాయి.

ఈ పరిస్థితిని గమనించిన నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో ఒక సొరంగాన్ని నిర్మించాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా 6, 808 కోట్ల రూపాయల కేటాయించారు. సుమారు 13.15 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించారు. దీనికి జోజిలా పాస్ అని నామకరణ చేశారు. ఇది కార్గిల్, జోజిలా, ద్రాస్ ప్రాంతాలకు ఏడాది పాటు రాకపోకలు సాగేలా చేస్తుంది. 2020 అక్టోబర్ 1న ఫస్ట్ స్టేజి పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా ఇందులో అంతర్గతంగా రోడ్లు నిర్మించాలి. సైడ్ డ్రైనేజీలు నిర్మించాలి. నిఘా కెెమెరాలు.. మరో ఏడాదిలో ఈ పూర్తవుతాయి.

బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్, కార్గిల్ ప్రాంతంలో మీనా మార్గం తూర్పు పోర్టల్ వరకు ఈ టన్నెల్ విస్తరించి ఉంది.. ఈ ప్రాంతాలతో పాటు శ్రీనగర్, లద్ధాక్ ప్రాంతాలకు ఏడాదిపాటు ప్రయాణం సాగించవచ్చు. సముద్రమట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు.. ఇది ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన బై డైరెక్షనల్ సొరంగం. ఇది గనుక అందుబాటులోకి వస్తే బాల్తాల్ నుంచి మీనా మార్క్ ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం అయితే నాలుగు గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో డిఫెన్స్ ఆపరేషన్లు చేపట్టడానికి భారత సైన్యానికి ఈ మార్గం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version