https://oktelugu.com/

India Vs China: చైనా లోపలికి భారత్ ప్రవేశించింది.. ఆ ప్రాంతాలను ఆక్రమించేసింది..

డోక్లాం సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య వివాదం చెలరేగింది. అప్పట్లో కూడా ఇరు దేశాల సైనికులు వాగ్వాదానికి దిగారు. అయితే ఈసారి కూడా చైనా దేశ సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Written By:
  • Rocky
  • , Updated On : September 17, 2023 12:50 pm
    India Vs China

    India Vs China

    Follow us on

    India Vs China: మనం ఇన్నాళ్లు.. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడమే చూశాం. ఈశాన్య రాష్ట్రాలకు రావలసిన బ్రహ్మపుత్రా నది జలాలను డ్రాగన్ అడ్డగోలుగా వాడుకోవడమే చూసాం. ఆ జీవనది మీద చైనా ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మించడమే చూశాం. కానీ చరిత్రలో తొలిసారిగా భారత్ చైనా భూభాగాన్ని ఆక్రమించింది. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఈ విషయం చెబుతోంది భారత్ కాదు… చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అక్కడి మీడియా. దీనిని అక్కడి సైన్యం కూడా ధ్రువీకరించడం విశేషం.
    చైనాకు, భారత్ కు మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో గతంలో డ్రాగన్ సైన్యం చొరబాట్లకు ప్రయత్నించేది. ఆ తర్వాత భారత సైన్యం స్పందిస్తే.. చర్చిద్దామని సంప్రదింపులు ప్రారంభించేది. ఆ తర్వాత నిధానంగా ఆ ప్రక్రియ ప్రారంభించేది. కొంతకాలానికి తమ సైన్యం ప్రవేశించిన ప్రాంతం తమదే అని వితండవాదానికి దిగేది. అంతర్జాతీయ వేదికలపై ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించేది. ఫలితంగా భారత్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనేది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. డోక్లాం, తవాంగ్,గాల్వాన్ లోయ ప్రాంతాల్లో చైనా సైనికులు చొరబాట్లకు ప్రవేశించినప్పుడు.. భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో గల్వాన్ లోయలో చైనా, భారత్ సైన్యం మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో భారత సైనికులు కన్నుమూశారు. వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ కూడా ఉన్నారు. అయితే భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడంతో చైనా సైనికులు భారీ సంఖ్యలోనే కన్నుమూశారు. చాలామంది గాయపడ్డారు. అలీన ఒప్పందం అమల్లో ఉన్న నేపథ్యంలో మందు గుండు సామాగ్రి, ఆయుధాలు వాడకుండా ఇరు దేశాల సైనికులు యుద్ధం చేయాల్సి ఉంటుంది.

    ఇక ఆ మధ్య డోక్లాం సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య వివాదం చెలరేగింది. అప్పట్లో కూడా ఇరు దేశాల సైనికులు వాగ్వాదానికి దిగారు. అయితే ఈసారి కూడా చైనా దేశ సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే చైనా భారత్ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీనిని తిప్పి కొట్టిన భారత సైనికులు.. ఇప్పుడు ఆ దేశంలోకే ప్రవేశించడం మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్లు కూడా తెలుస్తోంది. అయితే చరిత్రలో ఇప్పటివరకు భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ వచ్చిన చైనా.. తొలిసారిగా తమ ప్రాంతాన్ని భారత సైనికులు ఆక్రమించారని చెప్పడం, అది కూడా ఆ దేశానికి చెందిన అధికారిక మీడియా ప్రకటించడం విశేషం. అయితే చైనా దేశంలో ఏ ప్రాంతాన్ని భారత సైనికులు ఆక్రమించారు? అది ఎక్కడ సరిహద్దు ప్రాంతంలో ఉంది అనేది ఇంతవరకు డ్రాగన్ మీడియా బయటకు చెప్పలేదు. ఒకవేళ ఈ విషయాన్ని పూర్తి ఆధారాలతో సహా వెల్లడిస్తే తన సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే గోప్యంగా ఉంచుతోంది. కాగా ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాలలో మీడియా పట్టించుకోలేదు. కానీ జాతీయ మీడియా మాత్రం ప్రముఖంగా ప్రచురించింది.