కరోనా సంక్షోభంపై మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కరోనా మొదటి వేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్న ప్రజలు సెకండ్ వేవ్ ను కూడా అదే స్థాయిలో తిప్పి కొడుతున్నారని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజల ప్రాణాలు నిలపడానికి అవసరమై ఆక్సిజన్ సరఫరాలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఆక్సిజన్ తరలింపులో వారి సేవలు అసాధారణమైనవిగా ప్రధాని పేర్కొన్నారు. […]

Written By: Srinivas, Updated On : May 30, 2021 1:59 pm
Follow us on

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కరోనా మొదటి వేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్న ప్రజలు సెకండ్ వేవ్ ను కూడా అదే స్థాయిలో తిప్పి కొడుతున్నారని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజల ప్రాణాలు నిలపడానికి అవసరమై ఆక్సిజన్ సరఫరాలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఆక్సిజన్ తరలింపులో వారి సేవలు అసాధారణమైనవిగా ప్రధాని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అవసరమైన నగరాలకు తీసుకెళ్లడంలో రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. మహిళా లోకో పైలెట్ శిరీషతో ప్రధాని తన అనుభవాలు పంచుకున్నారు.

వందేళ్లకోసార వచ్చే ప్రళయ పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని సమర్థంగా తిప్పికొడుతున్నామని పేర్కొన్నారు. ఇదివరకే ప్రజలు వైరస్ ఎదుర్కోడంలో చూపిస్తున్న తెగువను ప్రదర్శిస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవాలని చె ప్పారు. కరోనాపై గెలుపును త్వరలో అందుకోబోతున్నామని పేర్కొన్నారు.

రోజుకు 20 లక్షల పరీక్షలు చేస్తున్నామని ప్రధాని వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో టెస్టులు చేయడంలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర అమోఘమని చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్లు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ వర్కర్లు వరి సేవలను అందిస్తున్నారని గుర్తు చేశారు. ఒక్కోసారి తాము రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్లకుండా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని గుర్తు చేశారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ విజయనగరం మామిడిపళ్ల గురించి ప్రస్తావించారు. కిసాన్ రైళ్ల ద్వారా వేర్వేరు ప్రాంతాలకు చెందిన దిగుబడులు దేశవ్యాప్తంగా మార్కెట్లకు సరఫరా అవుతున్నాయన్నారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో రైతులు అద్భుతాలను సృష్టిస్తున్నారని చెప్పారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడులు సాధిస్తున్నారని గుర్తు చేశారు.