సంచలనాలు, సవాళ్ల మధ్య మోదీ మొదటి ఏడాది పాలన

ఒక కాంగ్రెసేతర వ్యక్తి వరుసగా రెండోసారి పూర్తి ఆధిక్యతతో ఎన్నికలలో విజయం సాధించి, సొంతబలంపై ప్రధాన మంత్రి పదవి చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ రెండో సారి మొదటి ఏడాది పాలన మొత్తం సంచలనాలు, సవాళ్ల మధ్య జరిగింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటి ద్వారా సంచలనాలకు దారితీయగా, మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం పెను సవాల్ గా పరిణమించింది. ఏది […]

Written By: Neelambaram, Updated On : May 30, 2020 11:37 am
Follow us on


ఒక కాంగ్రెసేతర వ్యక్తి వరుసగా రెండోసారి పూర్తి ఆధిక్యతతో ఎన్నికలలో విజయం సాధించి, సొంతబలంపై ప్రధాన మంత్రి పదవి చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ రెండో సారి మొదటి ఏడాది పాలన మొత్తం సంచలనాలు, సవాళ్ల మధ్య జరిగింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటి ద్వారా సంచలనాలకు దారితీయగా, మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం పెను సవాల్ గా పరిణమించింది.

ఏది ఏమైనా దేశ ప్రయోజనాలను కాపాడటం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టతను ఇనుమడింప చేయడంలో మరెవ్వరికీ తీసిపోని విధంగా ప్రధాని మోదీ ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించారు. కరోనాతో మొత్తం ప్రపంచానికే భారత్ ఎక్కడ భారంగా అమారుతుందో అని అందరు ఆందోళన చెందుతున్న సమయంలో ప్రపంచానికే మందులు, ఇతరత్రా సహకారం అందించడం ద్వారా విస్మయం కల్గించారు.

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి నేటికి ఏడాది అవుతోంది. ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ మోడీ 2.0 మొదటి సంవత్సరం సాహసోపేతంగా గడిచింది. మొదటి ఐదేళ్లలో సంస్కరణలు, పలు మౌలిక మార్పులు, సాధారణ ప్రజల జీవనాలలో వెలుగులు నింపడం పట్ల దృష్టి సారించగా, రెండో సారి సుదీర్ఘకాలం దేశాన్ని పట్టి పీడిస్తున్న భావాత్మక సమస్యలపై దృష్టి సారించారు.

జామ్ (జన్‌‌ధన్‌‌, ఆధార్‌‌, మొబైల్‌‌) త్రయాన్ని ఉపయోగించి ఆర్ధికంగా సాధారణ ప్రజలకు సాధికారికత కలిగించిన ప్రధాని, స్వచ్ఛ భారత్‌‌తో శుభ్రత పెంపొందించడం, ఆయుష్మాన్ భారత్‌‌తో ఆరోగ్య భరోసా కలిగించడంలో రికార్డు సృష్టించారు. దానితో ప్రతిపక్షాల దుష్ప్రచారాలు తిరస్కరించిన దేశ ప్రజలు తిరిగి 2019లో మరోసారి మోదీకి పాలనా బాధ్యతలు అందించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ను కేంద్రంగా మార్చడంలో విజయం సాధిస్తున్నారు. సులభతరం వాణిజ్యంలో భారత్ పటిష్టతను ఎంతగానో ఇనుమడింప చేశారు. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశంగా అవతరించింది.

ఒకవిధంగా కొవిడ్ 19 రూపంలో పెద్ద సవాలు దేశాన్ని చుట్టుముట్టింది. ప్రాధమిక వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉన్న భారత్ వంటి దేశం ఈ వైరస్ ను ఎదుర్కోవడం అసాధ్యం అని అందరూ అనుకొంటున్న సమయంలో ఆర్ధికంగా ముందున్న దేశాలను సహితం ఆచార్య పరచే రీతిలో చర్యలు చేపట్టారు. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడమే కాకుండా ప్రజా సహకారంతో విజయవంతంగా అమలు పరుస్తున్నారు.

రాజకీయంగా ఎన్ని వైమష్యాలు నెలకొన్న ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉమ్మడిగా పనిచేయడం మన ప్రజాస్వామ్య పరిణితికి నిదర్శనం. పరసర్పం సంప్రదింపులతో సహకార సమాఖ్య వ్యవస్థకు జీవం పోశారు. రెండు నెలలోనే అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చు కోవడమే కాకుండా, విదేశాలలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం మన సామర్ధ్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఇప్పటి వరకు దేశం పట్టించుకోనని వలస కార్మికుల సమస్య ఈ సమయంలో ఎంత జఠిలమైనదో దేశ ప్రజలు ఆదృష్టికి వచ్చింది. ఆ సమస్యను సహితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు, ఔదార్యం ప్రదర్శించిన సాధారణ ప్రజలు మరోవైపు వారికి అండగా ఉంది, వారికి అవసరమైన సేవలు అందించడం అపూర్వం. మన సామజిక శక్తికి నిదర్శనం అని చెప్పవచ్చు.

ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తుందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు వ్రాసిన బహిరంగ లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని తెలిపారు.

ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు చెబుతూ సవాళ్లను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం గడిచిన ఏడాదిలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందని, అదేవిధంగా దేశం వేగంగా అభివృద్ధి సాధించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనా భారతదేశాన్ని తాకినప్పుడు భారత్‌ ప్రపంచానికి సమస్యగా మారుతుందని చాలా మంది భయపడ్డారని, కానీ నేడు మనం తీసుకున్న చర్యలతో ప్రపంచమే మన వైపు చూస్తుందని ప్రధాని గుర్తు చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌ ప్రపంచాన్ని ఆశ్యర్యపరుస్తుందని చెబుతూ భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందని పేర్కొన్నారు.

“ఇందుకు మీరే కారకులన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన, సంపన్న దేశాలతో పోల్చితే ఇది అసమానం” అంటూ ప్రజా సహకారాన్ని కొనియాడారు. చప్పట్లు చరవడం గానీ, దీపాలు వెలిగించడం గానీ, కరోనా యోధులను ఆర్మీ గౌరవించడం గానీ, జనతా కర్ఫ్యూ గానీ, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నియమాలను కచ్చితంగా పాటించడం ఇలా ప్రతి సందర్భంలోనూ ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ అని నిరూపించారని ప్రధాని పేర్కొన్నారు.

మన దేశం ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటుందని ప్రధాని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు రాత్రనక, పగలనక తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని తనకు తెలుసని అంటూ తనలో లోపాలు ఉండొచ్చు.. కానీ దేశానికి కాదని స్పష్టం చేశారు. కాబట్టే తనకంటే దేశ ప్రజల్ని, వారి బలాన్ని, వారి సామార్థ్యాలను నమ్ముతున్నట్లు తెలిపారు.