https://oktelugu.com/

మరో బాదుడుకు రెడీ అయిన మోడీ సర్కార్

ఏడాది కాలంగా దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి నెలల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రూ.20 లక్షల కోట్లతో కూడిన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం వంటి కొన్ని ఉపశమన చర్యలకు సంబంధించిన రెవెన్యూ లోటును రాబట్టుకోవడానికి సెస్ విధించే దిశగా […]

Written By: , Updated On : January 11, 2021 / 03:13 PM IST
Follow us on

Modi
ఏడాది కాలంగా దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి నెలల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రూ.20 లక్షల కోట్లతో కూడిన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం వంటి కొన్ని ఉపశమన చర్యలకు సంబంధించిన రెవెన్యూ లోటును రాబట్టుకోవడానికి సెస్ విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: నేను రాను.. నన్ను ఇబ్బంది పెట్టకండి : మరోసారి క్లారిటీ ఇచ్చిన రజనీ

కరోనా వైరస్ మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వచ్చే బడ్జెట్‌లో కరోనా సెస్ లేదా సర్‌చార్జిని విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కొన్ని వరుస భేటీలను కూడా నిర్వహించినట్లు సమాచారం. సెస్ రూపం ఎలా ఉండాలి? ఎంత శాతాన్ని అమల్లోకి తీసుకుని రావాలి? ఏయే వర్గాలకు చెందిన ప్రజలకు దీన్ని వడ్డించాలనే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటిని చేర్చుతారని చెబుతున్నారు.

Also Read: మరో రాష్ట్రంలో కూల్చివేతకు బీజేపీ రె‘ఢీ’!

బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన నిర్వహించేబోయే మంత్రివర్గ సమావేశంలో కరోనా సెస్ లేదా కోవిడ్ సర్‌చార్జి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని, త్వరలోనే దీనికి తుది రూపాన్ని ఇస్తుందని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయంపై ఇది పూర్తిగా ఆధారపడి ఉండొచ్చని, కేబినెట్ ఆమోదిస్తే.. కరోనా వైరస్ సెస్ ప్రతిపాదనలను బడ్జెట్‌లో చేర్చుతారని అంటున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

సెస్ లేదా సర్‌చార్జి రూపంలో కొత్త లేవీని విధించే విషయంలో మాత్రం కేంద్రం ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదు. అయితే ఈ నిర్ణయాన్ని పరిశ్రమలు, ఆర్థిక నిపుణులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నూతన బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం వివిధ పారిశ్రామిక వేత్తల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో ఓ భేటీ నిర్వహించింది. ప్రస్తుత సమయంలో కొత్త కొత్త పన్నులను విధించరాదని, ఇది ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదని కేంద్రానికి తెగేసి చెప్పారు. నూతన సెస్‌ను విధించే విషయంలో మాత్రం అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు కొందరు స్పష్టం చేస్తున్నారు. అధిక ఆదాయం కలిగి ఉన్నవారికి పరోక్షంగా పన్నులు వేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో ప్రతిపాదననూ కేంద్రం సిద్ధం చేసింది. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధించాలని ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు.