హీరో రవితేజ – గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇపుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. వీరి కలయికలో సినిమా రూపొందడం ఒకటైతే, మరో విషయం… కోవిడ్.. థియేటర్స్ అన్‌లాక్ నేపథ్యంలో విడుదలైన తొలి స్టార్ హీరో సినిమా ‘క్రాక్’. తొలి రెండు చిత్రాలకు భిన్నంగా రవితేజను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శకుడు తెరపై ప్రెజంట్ చేశారు. అయితే విడుదలకి సిద్దమైన ఈ చిత్రానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా ఎట్టకేలకు విడుదలైంది.
Also Read: ప్రేమికుల ఎదురుచూపులకు మోక్షం.. రానున్న ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ !
శనివారం ఉదయం ఆటతో ప్రారంభం కావాల్సిన ఈ మూవీ చిత్ర నిర్మాత వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు ఆర్ఠిక ఇబ్బందులు తొలగిపోవడంతో శనివారం రోజున ఫస్ట్ షోతో థియేటర్లలో సందడి షురూ చేసింది. మొదటి ఆట నుండే ప్రేక్షకులు సక్సెస్ రివ్యూస్ ఇచ్చారు. రవితేజ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన ‘క్రాక్’.. మెజారిటీ థియేటర్లలో తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో నడిచింది. మొదటి ఆట నుండే ప్రేక్షకులు సక్సెస్ రివ్యూస్ ఇచ్చారు. ఆదివారం రోజుతో ఏకంగా ఐదు కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Also Read: గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు – అనిల్ రావిపూడి !
రవితేజ గత సినిమా ‘డిస్కో రాజా’తో పోలిస్తే క్రాక్ మూవీకి ఓపెనింగ్స్ చాలా ఎక్కువగానే వచ్చాయి. కోవిడ్ నిబంధనల కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే ప్రదర్శనలు ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో మాస్ రాజా మూవీ కి ఓపెనింగ్స్ రావటంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పండుగ ఇప్పుడేయ్ మొదలైయినట్లుందట, ఈ సక్సెస్ తో సంక్రాతి సీజన్లో విడుదలవుతున్న మూవీస్ దర్శక నిర్మాతలకి బూస్ట్ అప్ లాగ ఉందట. ఆఫ్టర్ లాంగ్ టైం మాస్ రాజా ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో క్రాక్ మూవీ ఉంది. మరో రెండు రోజులు మాత్రమే క్రాక్ వసూళ్లకు ఏం ఢోకా లేదు , ఆ తరువాత వరుసపెట్టి సినిమాలు విసుద్ధలవుతాయి కనుక రవితేజా ఈ లోపలనే బ్రేక్ ఈవెన్ కి వస్తే నిర్మాత లాభాలతో బయటపడతాడని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్