https://oktelugu.com/

మోదీ.. సర్కారువారి పాట ‘2024’

మేకిన్ ఇండియా నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికంటూ.. ఏం మిగలకుండా చేసుకుంటోంది. ప్రయివేటు సంస్థలకు కొమ్ముకాస్తూ… ప్రజా సొమ్మును తాకట్టు పెడుతోంది.. కాదుకాదు.. ఏకంగా అమ్మేస్తోంది. ఆలోచనకు వచ్చిన ప్రతీ సంస్థను ప్రయివేటుపరం చేస్తూ.. అసలు దేశానికంటూ ఏమైనా మిగులుతాయా..? అనే అనుమానం కలిగేలా చేస్తున్నారు.. విజన్ భారత్ కెప్టెన్ మోదీజీ. ఓ వైపు పెరుగుతున్న ధరలు సామాన్యుడిని సతమతం చేస్తుంటే.. సంస్థల ప్రయివేటీకరణ సగటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2021 / 12:55 PM IST
    Follow us on


    మేకిన్ ఇండియా నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికంటూ.. ఏం మిగలకుండా చేసుకుంటోంది. ప్రయివేటు సంస్థలకు కొమ్ముకాస్తూ… ప్రజా సొమ్మును తాకట్టు పెడుతోంది.. కాదుకాదు.. ఏకంగా అమ్మేస్తోంది. ఆలోచనకు వచ్చిన ప్రతీ సంస్థను ప్రయివేటుపరం చేస్తూ.. అసలు దేశానికంటూ ఏమైనా మిగులుతాయా..? అనే అనుమానం కలిగేలా చేస్తున్నారు.. విజన్ భారత్ కెప్టెన్ మోదీజీ. ఓ వైపు పెరుగుతున్న ధరలు సామాన్యుడిని సతమతం చేస్తుంటే.. సంస్థల ప్రయివేటీకరణ సగటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

    Also Read: వరుస భేటీలు స్టార్ట్‌ చేసిన షర్మిల..: పార్టీ ప్రకటన అప్పుడే..?

    సమయం లేదు మిత్రమా.. దొరికింది దోచేయ్.. ఉన్నది ఊడ్చేయ్.. అన్నట్లు కొనసాగుతోంది.. కేంద్ర ప్రభుత్వం తీరు. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ, వాటాల అమ్మకం, ఇలా చెప్పుకుంటూ పోతే.. మోదీకున్న మూడేళ్ల సమయంలో కేంద్ర్ ప్రభుత్వం పరిధిలో ఉన్న ఆస్తులను మొత్తం అమ్మేసేలా కనిపిస్తోంది.. పేరుకు పేదట ప్రభుత్వం అని చెప్పుకుంటూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ.. మొన్నటి బడ్జెట్ సమావేశంలో బల్లలు గుద్దుతూ మరీ.. పలు వ్యవస్థల అమ్మకానికి ప్రణాళిక రచించారు.. మోదీ.. నిర్మలా అండ్ టీం. ఈ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంటు కూడా ఉంది. వీలైతే అమ్మకం.. లేకుంటే మూతే అన్న తీరుగా ప్రభుత్వం తీరు ఉంటోందని పలువురు అంటున్నారు. ఒకవేళ్ల అమ్మలేని పరిస్థితులు వస్తే.. వాటిని మూసేయడానికి కూడా తమకు మొహమాటం లేదని కేంద్ర మంత్రి ఒకరు బాహాటంగానే చెప్పేశారు. ఇదీ మోదీ విజన్ మరీ.

    ఇక బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రక్రియ కూడా ఊపందుకుంటోంది. నిరార్థక ఆస్తుల సాకుతో.. పలు బ్యాంకులను ప్రయివేటుకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. ఈ జాబితాలో ముందు వరుసలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలు విక్రయించేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా.. మినిమం రెండు బ్యాంకులను అమ్మేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది.

    Also Read: ఏదో అనుకుంటే మరేదో చేశారు..: నిమ్మగడ్డ నిర్ణయంపై విపక్షాల ఫైర్‌‌

    అంతకన్నా.. పెద్ద ట్విస్టు ఏమిటంటే.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాకు వాటాలను కూడా అమ్మేయాలనే ఉద్దేశంతో ఉందంట కేంద్ర ప్రభుత్వం. చిన్నిచిన్న బ్యాంకులను, బలహీనంగా ఉన్న బ్యాంకులను కొనడానికి ముందుకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి.. లాభాల్లో ఉన్న, భారీ వ్యవస్థలు అయిన బ్యాంకులనే అమ్మకానికి పెడితే.. వచ్చేవాళ్లు ఉత్సాహంగా వస్తారనే లెక్కలతో కేంద్రం ఉందనే వార్తలు సామాన్యుడిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఓ వైపు హక్కుల కోసం బ్యాంకు సిబ్బంది ఆందోళనలు చేస్తుంటే.. 2024 నాటికి ప్రభుత్వ కంపెనీలను మొత్తం అమ్మేయడానికి చూస్తోందని పలువురు అంటున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్