టీడీపీని భయపెడుతున్న మున్సిపల్ ఎన్నికలు..?

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అవుతోంది.. ఏపీలో టీడీపీ పరిస్థితి.. ఒకప్పుడు దూసుకెల్లిన సైకిల్.. ప్రస్తుతం రెండురాష్ట్రాల్లో చతికల పడుతోంది. ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతూ… కనీసం తమకంటూ.. ఉన్న ఓ గుర్తింపును కోల్పోతూ.. ఎన్నికలంటేనే వణుకుతోంది.. టీడీపీ పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద నెపం. తరువాత మాత్రం ఈవీఎంలపై మాట్లాడడం లేదు. అలా మాట్లాడితే.. మోదీ ఏమంటారో అనే భయం. తరువాత వైసీపీ పార్టీ గాలికి గెలిచిందని వ్రకభాష్యం. మొదట ఈవీఎంలు.. తరువాత గాలికి […]

Written By: Srinivas, Updated On : February 16, 2021 1:02 pm
Follow us on


మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అవుతోంది.. ఏపీలో టీడీపీ పరిస్థితి.. ఒకప్పుడు దూసుకెల్లిన సైకిల్.. ప్రస్తుతం రెండురాష్ట్రాల్లో చతికల పడుతోంది. ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతూ… కనీసం తమకంటూ.. ఉన్న ఓ గుర్తింపును కోల్పోతూ.. ఎన్నికలంటేనే వణుకుతోంది.. టీడీపీ పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద నెపం. తరువాత మాత్రం ఈవీఎంలపై మాట్లాడడం లేదు. అలా మాట్లాడితే.. మోదీ ఏమంటారో అనే భయం. తరువాత వైసీపీ పార్టీ గాలికి గెలిచిందని వ్రకభాష్యం. మొదట ఈవీఎంలు.. తరువాత గాలికి అని ఇప్పుడా గాలికి తామే కొట్టుకుపోయిన విషయాన్ని ప్రస్తావించే ధైర్యం కూడా చేయడం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Also Read: వరుస భేటీలు స్టార్ట్‌ చేసిన షర్మిల..: పార్టీ ప్రకటన అప్పుడే..?

తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో పెకలించబడిన దృశ్యం ఏపీ స్థానికసంస్థల ఎన్నికల్లో కనిపిస్తోంది. ఒక పేరున్న రాజకీయ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనో.. అసెంబ్లీ ఎన్నికల్లోనో ఓడిందంటే. అది అప్పటివరకే. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేనాటికి ఈ పార్టీ పుంజుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. 1999 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడా తన ఉనికిని కోల్పోలేదు. అప్పటికే తెలుగుదేశం పార్టీ రెండు పర్యాయాలు అధికారం చేపట్టంది. చంద్రబాబు పేరున్న సీఎంగా మంచి స్ట్రాంగ్ లీడర్ గా కొనసాగుతున్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అదే ప్రభావంతో 2004 ఎన్నికల్లో విజేతగా నిలిచింది.

ఏ పార్టీ అయితే స్థానికసంస్థల ఎన్నికల్లో ఓడిపోతుందో.. దాని పతనం ప్రారంభం అయ్యిందని అనుకోవాల్సిందే. పంచాయతీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు ఏవేవో సాకులు చెప్పి.. ఓటమిని తక్కువ చేసే ప్రయత్నం చేయవచ్చు కానీ.. పరిస్థితి చేయిదాటిపోయిందని మాత్రం స్పష్టం అవుతోంది. ఇలా మూలుగుతున్న టీడీపీపై మున్సిపల్ ఎన్నికలు పడుతున్నాయి. తమ కంచుకోటల్లోనూ.. గత ఏడాది ముప్పు తిప్పలు పడింది టీడీపీ. కార్యకర్తలను మీటింగులంటూ పిలిచి.. వారిచేత నామినేషన్ల పత్రాలపై సంతకాలు పెట్టించుకున్న పరిస్థితి. అలా నామినేషన్లు వేసిన వారు ఏమాత్రం ప్రచారం చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే..

Also Read: ఏదో అనుకుంటే మరేదో చేశారు..: నిమ్మగడ్డ నిర్ణయంపై విపక్షాల ఫైర్‌‌

పంచాయతీ ఎన్నికలు ఎలాగూ పార్టీ గుర్తుల మీద జరగవు కాబట్టి.. తెలుగుదేశం పార్టీ ఏవో లెక్కలు చెప్పగలిగిదిం. అయితే మున్సిపల్.. కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా ఎన్నికల గుర్తులపైనే జరుగుతాయి కాబట్టి ఎవరిసత్తా ఏమితో ఇట్టే తెలిసిపోతుంది. పట్టణాల్లో ఎవరిపట్టు ఏమిటో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తంమీద ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో కూడా క్లారిటీ వస్తుంది. ఏ సర్వేలు.. ఎవరి అధ్యయనాలు.. ఎవరి వాదనలు అవసరం లేకున్నా.. ఎవరికెంత అకనుకూలత ఉందో క్లారిటీ వస్తుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్