పెట్రోల్, డీజిల్ లపై పన్ను పోటు

ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటె ఆ ప్రయోజనాలు భారత ప్రజలకు చేరకుండా కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్ పై 3రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన ఫలితం వినియోగదారులకు అందకుండా కేంద్రం […]

Written By: Neelambaram, Updated On : March 14, 2020 3:15 pm
Follow us on


ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటె ఆ ప్రయోజనాలు భారత ప్రజలకు చేరకుండా కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

లీటర్ పెట్రోల్ పై 3రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన ఫలితం వినియోగదారులకు అందకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో బ్యాలెన్స్ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తున్నాయి.

ఇక స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పై రూ.2నుంచి 8పెంచగా.. డీజిల్ పై రూ.4కు పెంచింది. అటు పెట్రోల్ పై రూపాయి, డీజిల్ పై రూ.10 వరకు రోడ్ సెస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల జేబుకు చిల్లులు పడనున్నాయి.

గత ఆరేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరుగుతూ రావడం తెలిసిందే.