నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబులు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ మూవీకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. నాని 25వ చిత్రం ‘వి’ మూవీ తెరకెక్కుతుంది. నాని ఇందులో ‘రాక్షసుడి’గా నెగిటివ్ షెడ్స్ లో కనిపించనున్నాడు. అలాగే సుధీర్ బాబు ‘రక్షకుడిగా’ అలరించేందుకు సిద్ధపడుతున్నాడు. ఈ మూవీని మార్చి 25న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. కరోనా మహమ్మారి తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ అవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా చిత్రమండలి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ‘వి’ మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
‘వి’లో నివేదా థామస్, అదితిరావ్ హైదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈనెల 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేసింది. అయితే కరోనా ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు. ఈ ఎఫెక్ట్ తో బడా సినిమాలకు కూడా కలెక్షన్లు తగ్గాయి. దీంతో ఇప్పటికే రిలీజ్ చేయాలకున్న సినిమాలను పలువురు నిర్మాతలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వి’ నిర్మాతలు కూడా తాజాగా చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ల్ లకు చిత్ర పరిశ్రమ దూరంగా ఉంటుంది. అలాగే థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండటంతో నిర్మాతలు ఆలోచనలు పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూవీలను రిలీజ్ చేస్తే నష్టపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమాలను వాయిదాలు వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గాక సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్లో ‘వి’ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. చూడాలి మరీ అప్పటి వరకు కరోనా ప్రభావం తగ్గుతుందో లేదో మరీ..