https://oktelugu.com/

జగన్ సర్కార్ కు మోదీ శుభవార్త.. కడప జిల్లాలో..?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సఖ్యతతో మెలుగుతున్న సంగతి విదితమే. దీంతో మోదీ సర్కార్ సైతం జగన్ సర్కార్ కు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మోదీ సర్కార్ ఏపీ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది. కడప నుంచి రేణిగుంట వరకు నాలుగు వరుసల హైవేకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా త్వరలో ఈ హైవేకు టెండర్లను పిలవనుంది. Also Read: […]

Written By: , Updated On : October 26, 2020 / 09:43 AM IST
Follow us on

CM Jagan
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సఖ్యతతో మెలుగుతున్న సంగతి విదితమే. దీంతో మోదీ సర్కార్ సైతం జగన్ సర్కార్ కు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మోదీ సర్కార్ ఏపీ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది. కడప నుంచి రేణిగుంట వరకు నాలుగు వరుసల హైవేకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా త్వరలో ఈ హైవేకు టెండర్లను పిలవనుంది.

Also Read: వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

కడప – రేణిగుంట నాలుగు లేన్ల హైవే ద్వారా హైదరాబాద్ – తిరుపతి, హైదరాబాద్ – చెన్నైలకు ప్రయాణ సమయం తగ్గనుంది. కేంద్రం ఈ హైవే మార్గాన్ని కొన్నిరోజుల క్రితం గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా గుర్తించింది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసలుగా మార్చాలని తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1,068 ఎకరాల భూమిని సేకరించి ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ రహదారి నిర్మాణంలో దాదాపు కడప జిల్లాలోనే 100 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరగనుంది. 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించి నాలుగు లేన హైవే మార్గాన్ని పూర్తి చేయనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ కడపలోని బద్వేల్ నుంచి నెల్లురు కృష్ణపట్నం పోర్టు వరకు 138 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కొరకు ఇప్పటికే డీపీఆర్ ను సిద్ధం చేసింది. అధికారులు ఇప్పటికే భూసేకరణ చేపట్టారు.

Also Read: జగన్ తనదైన రీతిలో మర్యాద చేస్తున్నాడట!

వైఎస్సార్‌ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరగనుందని తెలుస్తోంది. కేంద్రం ఈ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు నాలుగు లేన్ల హైవే టెండర్లను త్వరలోనే పూర్తిచేసి పనులను ప్రారంభిస్తామని రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.,