Homeజాతీయ వార్తలుModi Foreign Tour Expenses: ఐదేళ్లలో రూ.326 కోట్లు.. మోదీ ఫారిన్‌టూర్‌ ఖర్చు

Modi Foreign Tour Expenses: ఐదేళ్లలో రూ.326 కోట్లు.. మోదీ ఫారిన్‌టూర్‌ ఖర్చు

Modi Foreign Tour Expenses: ప్రధాని నరేంద్రమోదీ.. తనకు వచ్చిన బహుమతులను, జ్ఞాపికలను ఆన్‌లైన్‌లో వేలం వేసి వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థలకు ఇస్తుంటారు. ఇందులో స్వదేశంలోని జ్ఞాపికలతోపాటు విదేశాలకు చెందిన జ్ఞాపికలు కూడా ఉంటాయి. ఇక మోదీకి ఆస్తులు కూడా పెద్దగా లేవు. కానీ, మోదీ విదేశీ పర్యటనకు చేస్తున్న ఖర్చు మాత్రం మామూలుగా లేదు. కేవలం 5 ఏళ్లలో రూ.326 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇది ఎవరో చెప్పిన లెక్క కాదు.. స్వయంగా కేంద్రమే పార్లమెంటుకు సమర్పించింది.

Also Read: గోబ్యాక్‌ అన్నోడే.. వెల్కమ్‌ చెప్పాడు.. మోదీ దెబ్బ అదుర్స్‌ కదా!

దైత్య సంబంధాలు బలోపేతం..
మోదీ సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లరు. ఆ దేశాల నుంచి ఆహ్వానం వస్తేనే వెళ్లారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పలు దేశాలకు వెళ్తున్నారు. పలు దేశాలతో సత్సంబంధాలు, వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సైనిక, సాంకేతిక సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీ విదేశీ పర్యటన దేశ ఆర్థిక వ్యవస్థ, దౌత్య సంబంధాలు, అంతర్జాతీయ ఖ్యాతిని బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక ప్రకారం, 2021 నుంచి 2024 వరకు ఈ పర్యటనల కోసం రూ.295 కోట్లు ఖర్చయ్యాయని పేర్కొంది. 2025లో యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌ సహా ఐదు దేశాల పర్యటనలకు రూ.67 కోట్లు అదనంగా ఖర్చు కాగా, మొత్తం ఖర్చు రూ.362 కోట్లకు చేరింది.

ఖర్చు వివరాలలో అస్పష్టత
కేంద్రం ఈ ఖర్చులను వెల్లడిస్తూ, కొన్ని పర్యటనల గురించి సమాచారం దాచడం గమనార్హం. మారిషస్, కెనడా, బ్రెజిల్‌ వంటి తొమ్మిది దేశాల పర్యటనల ఖర్చు వివరాలు బహిర్గతం కాలేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓ బ్రియాన్‌ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చినప్పటికీ, ఈ అస్పష్టత పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ ఖర్చులలో విమాన ఖర్చు, భద్రతా ఏర్పాట్లు, స్థానిక రవాణా, ఇతర లాజిస్టిక్స్‌ ఏ రీతిలో ఉన్నాయనే దానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం.

Also Read:  రైతుల ఖాతాలో రూ.7,000.. ముహూర్తం ఫిక్స్!

ఖర్చు తగిన ఫలితం దక్కిందా?
ఐదేళ్లలో మోదీ విదేశీ పర్యటనకు రూ.362 కోట్లు ఖర్చు అయిన నేపథ్యంలో అందుకు తగిన ఫలితం బారత్‌కు దక్కిందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మోదీ పర్యటనలు భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు, వాణిజ్య ఒప్పందాలు, దౌత్య సంబంధాలలో బలాన్ని తెచ్చాయని బీజేపీ, ఎన్డీఏ నేతలు సమర్థించుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు భారతదేశ రక్షణ, సాంకేతిక, ఆర్థిక రంగాలలో ప్రయోజనాలను అందించాయి. అయితే, ఇంత భారీ ఖర్చు.. దేశంలోని ఆర్థిక సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే, ప్రతి రూపాయి ఖర్చుకు లెక్కలు ఉండాలని విపక్ష నేతలు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular