Modi Political Comeback: దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్రమోదీ కూడా వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. పడింత్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు సమం చేశారు. అయితే మోదీ ప్రధాని అయిననాటి నుంచి అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో అనేక దేశాలు భారత్‌కు మిత్ర దేశాలయ్యాయి. నరేంద్రమోదీ విశ్వగురువుగా కీర్తి అందుకుంటున్నారు. అనేక దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. అయితే మన పక్కనే ఉన్న ద్వీప దేశం మాల్దీవులు మాత్రం చైనాను నమ్ముకుని మనతో శత్రుత్వం పెంచుకుంది. ఆ దేశ అధ్యక్షుడిగా మహ్మద్ మెయిజ్జు ఎన్నికయిన తర్వాత ఇండియా గోబ్యాక్ నినాదం అందుకున్నారు. దీంతో మోదీ కూడా మాల్దీవులకు షాక్ ఇచ్చారు.
Also Read: టాటా పరువు తీస్తున్న టాప్ కంపెనీ.. రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు
స్నేహం నుంచి శత్రుత్వం వరకు..
మహ్మద్ మెయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడ అయ్యాక.. ఆయన భారత వ్యతిరేక విధానాలు అనుసరించడం మొదలు పెట్టారు. అతకుముందు భారత్, మాల్దీవులు మధ్య మంచి స్నేహం ఉండేది. అనేక మంది భారతీయులు ద్వీప దేశానికి హాలిడే ట్రిప్ వెళ్లేవారు. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన మాల్దీవులకు భారత్ పర్యాటకులతోనే 50 శాతం ఆదాయం వచ్చేది. అయితే మొయిజ్జు మాత్రం తన మంత్రులతో మోదీని తిట్టించడమే కాకుండా ఇండియా గోబ్యాక్ నినాదం అందుకున్నారు. దీంతో మిత్రుత్వం కాస్త శత్రుత్వంగా మారింది. మోదీ మాల్దీవులను ఒక్క మాట కూడా అనకుండా మన లక్ష్యద్వీప్‌కు వెళ్లి.. అక్కడి బీచ్‌లో గడిపారు. ఈమేరకు ఫొటోలు, వీడియోలను ఎక్స్‌లో పోస్టు చేశారు. మన లక్ష్య ద్వీప్ చాలా అందంగా ఉందని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో మాల్దీవులు వెళ్లే టూరిస్టులు తమ ట్రిప్‌లు క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మాల్దీవులు ఆదాయం భారీగా పడిపోయింది.
మళ్లీ స్నేహహస్తం..
చైనాను నమ్ముకున్న మెయిజ్జు.. తీవ్రంగా మోసపోయాడు. డ్రాగన్ స్నేహం ఎప్పటికైనా ప్రమామే అని గుర్తించారు. దీంతో మళ్లీ భారత్‌తో స్నేహానికి అనేక ప్రయత్నాలు చేశారు. మాల్దీవులు అధికారులు ముంబైతోపాటు అనేక నగరాల్లో పర్యటించి టూరిస్టులకు స్వాగతం పలికారు, ఆఫర్లు ప్రకటించారు. ఇక మహ్మద్ మెయిజ్జు అయితే నేరుగా ప్రధాని మోదీని మాల్దీవులకు రావాలని ఆహ్వనించారు. ఇండియా గోబ్యాక్ అన్నవారే ఇప్పుడు వెల్కమ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవులతో స్నేహం పునరుద్ధరించే క్రమంలో మోదీ.. జూలై 25, 26 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు.
Also Read: అనిల్ అంబానీపై ఈడీ ఉక్కుపాదం.. దాడుల వెనుక కారణం అదేనా ?
మోదీ తక్కువ మాట్లాడతారు.. ఎక్కువ పనిచేస్తారు. ఆయన వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అనేక దేశాలతో ఆయన సత్సంబంధాలు పెంచుకుంటున్నారు. ఈమేరకు పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా చైనాకు చెక్ పెట్టేందుకే మోదీ మాల్దీవుల పర్యటన ఉన్నట్లు తెలుస్తోంది.