ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చు లెక్క తేలింది. ఆయన ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏకంగా 58 దేశాలు చుట్టి రావడం విశేషం. ఇందుకోసం వెచ్చించిన మొత్తం తెలిస్తే కళ్లు జిగేల్ మనాల్సిందే..
Also Read: మరిన్ని బలగాల తరలింపు వద్దు
ప్రధాని నరేంద్రమోడీ 2015 నుంచి ఇప్పటివరకు మొత్తం 58 దేశాల్లో పర్యటించగా ఇందుకోసం 517 కోట్ల రూపాయలని మంగళవారం రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం తెలిపింది.
విపక్ష సభ్యుల కోరిక మేరకు మోడీ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంట్ ముందు ఉంచారు.
ఇక ఇందులో విశేషం ఏంటంటే.. అమెరికా, రష్యా, చైనా దేశాలను మోడీ ఏకంగా ఐదు సార్లు చొప్పున పర్యటించారు. ఇక సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యూఏఈ, శ్రీలంకలకు ఎక్కువగా పర్యటించారు.
ఈ నెల ప్రారంభంలో థాయ్ లాండ్ ను కూడా మోడీ సందర్శించారు. అయితే మోడీ విదేశీ టూర్లను ఆపిన ఘనత కరోనాదే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లలేదని వివరించారు. చివరగా గత ఏడాది నవంబర్ లో బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లారు.
Also Read: మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి రూ.4 వేలు బదిలీ..
కాగా మోడీ విదేశీ పర్యటనలపై పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలో సంక్షోభం వేళ.. జాతీయ ఎన్నికలకు ముందు కూడా మోడీ పట్టనట్టుగా విదేశాల్లో పర్యటించాడని ఆడిపోసుకుంటున్నాయి.