https://oktelugu.com/

మోనాల్, సుజాతలతో అవినాష్ పులిహోర ట్రాక్స్ !

మొత్తానికి బిగ్‌ బాస్ షో రోజురోజుకూ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ తన ప్రభావాన్ని చూపిస్తూ పోతుంది. ఈ క్రమంలోనే మూడో వారం పదహారో రోజు కూడా దుమ్ములేచిపోయింది అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా అవినాష్ కామెడీ సెన్స్ తో బిగ్‌బాస్ మొదటి ఫిజికల్ టాస్క్‌ లతో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వచ్చి చేరిందట. మెయిన్ గా మోనాల్, సుజాతలతో అవినాష్ కలిపే పులిహోర, కుర్రాళ్ళకు బాగా ఆసక్తిని కలిగిస్తోంది. అవినాష్ వచ్చిన రోజే మోనాల్‌ కు లైనేసి.. తనది కూడా […]

Written By:
  • admin
  • , Updated On : September 23, 2020 / 11:42 AM IST
    Follow us on


    మొత్తానికి బిగ్‌ బాస్ షో రోజురోజుకూ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ తన ప్రభావాన్ని చూపిస్తూ పోతుంది. ఈ క్రమంలోనే మూడో వారం పదహారో రోజు కూడా దుమ్ములేచిపోయింది అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా అవినాష్ కామెడీ సెన్స్ తో బిగ్‌బాస్ మొదటి ఫిజికల్ టాస్క్‌ లతో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వచ్చి చేరిందట. మెయిన్ గా మోనాల్, సుజాతలతో అవినాష్ కలిపే పులిహోర, కుర్రాళ్ళకు బాగా ఆసక్తిని కలిగిస్తోంది. అవినాష్ వచ్చిన రోజే మోనాల్‌ కు లైనేసి.. తనది కూడా పెద్ద ఫ్యామిలీ అని తనకు ఐదుగురు అన్నయ్యలు అంటూ.. మోనాల్ కి తన కుటుంబ నేపథ్యంలో ఆమె కోరుకునే అంశాలు ఉన్నాయంటూ ఆమెకు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో అయితే ఏకంగా పాట పాడి తెగ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు ఈ జబర్దస్త్ కమెడియన్.

    Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌

    సరే మోనాల్‌ తోనే కదా అనుకుంటే.. సుజాతను కూడా వదిలేలా లేడు. సుజాతతో మరో ట్రాక్ నడిపించడానికి అవినాష్ కిందా మీద పడుతున్నట్టుగా కనిపిస్తోంది. నడిపితే నడిపాడు, ఈ వ్యవహారంలో మోనాల్ గురించి చెబుతూ.. మోనాల్ 1970లోని హీరోయిన్‌లా ఉందని సుజాతతో చెబుతూ, సుజాతను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశాడు. పనిలో పనిగా సూపర్ ఉన్నవ్, అలానే చూస్తూ ఉండాలని అనిపిస్తోంది.. అంటూ సెటైర్ కూడా వేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఆట కూడా ఆడుకుంటూ వీక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ను పంచారు. అలాగే మధ్యలో మోనాల్‌ చేతులు పట్టుకుని గిరిగిరా తిరుగుతూ ఓ ఆటాడుకున్నాడు అవినాష్. ఇక మనుషులు రోబో టాస్క్‌లో భాగంగా కాస్త గొడవలు జరిగినట్టు అర్ధం అవుతుంది. రోబోల టీంలో అవినాస్ ఉండగా.. మనుషుల టీంలో సుజాత, మోనాల్ ఉన్నారు.

    Also Read: నా బయోపిక్ కు నేనే డైరెక్టర్ ను

    ఆ రకంగా కూడా వీరి మధ్య కెమిస్ట్రీ ఎలివేట్ అవడానికి ఉపయోగపడింది. ఇక అర్దరాత్రి అయిన తరువాత అందరూ అవినాష్‌ ను విష్ చేస్తూ.. బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చారు. కాగా ఈ క్రమంలో మోనాల్, సుజాతలు హగ్ చేసుకుని హ్యాపీ బర్త్ డే చెప్పడం.. పైగా సుజాత హగ్ ఇచ్చి.. ముద్దు కూడా పెట్టడం తో మొత్తానికి షోలో కాస్త మసాలా డోస్ కూడా ఎక్కువైంది. నిజానికి కంటెస్టెంట్లందరూ సుజాతను ఇప్పటికే అక్కో లేదా చెల్లో అంటూ ఫిక్స్ అయ్యారు, ఒక్క అవినాష్ తప్ప. అతను షోలోకి లేటుగా రావడంతో వీరిద్దరి మధ్య కొత్త ట్రాక్ ను నడిపేలా కనిపిస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఏది నడిపినా, అదంతా షో హిట్ అవ్వడానికే అని ప్రేక్షకులు అర్ధం చేసుకోవాలి.