India Ethanol Blending Strategy: పశ్చిమాసియా సంఘర్షణలు అంతర్జాతీయ చమురు సరఫరాను దెబ్బతీస్తుండగా, భారత్ ఇథనాల్ బ్లెండింగ్ వ్యూహంతో లక్షల కోట్ల ఆదా సాధించింది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారా విదేశీ చమురు ఆధారాన్ని తగ్గించారు. ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తూ 25 శాతం కలిపే అంశంపై కసరత్తు చేస్తోంది. దీంతో గల్్ఫ దేశాల చమురు దిగుతులు తగ్గే అవకాశం ఉంది.
అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యం
పశ్చిమాసియాలో ఉద్రిక్తులు ముడి చమురు ధరలు పెరిగాయి. సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీశాయి. భారత్ వంటి దిగుమతి ఆధార దేశాలకు ఇది హెచ్చరిక సంకేతంగా మారింది. పరాయి ఇంధనాలపై అత్యధిక ఆధారం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని గుర్తించిన కేంద్రం పునరుత్పాదక ఇంధనాల వైపు మలుపు తిప్పింది.
ఇథనాల్ బ్లెండింగ్..
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలవడంతో దేశానికి సంవత్సరానికి 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు ఆదా అవుతుంది. రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టం తగ్గింది. ఈ విజయంతో ప్రభుత్వం 25 శాతం లక్ష్యంగా పెట్టుకుంది, వాహన ఇంజిన్ సామర్థ్యం, పర్యావరణ ప్రభావాలను పరీక్షించి ముందుకు సాగుతోంది. ఈ వ్యూహం దేశీయ ఆధారాలను బలపరచడమే కాక, రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతోంది.
రిఫైనరీల విస్తరణపై దృష్టి..
దేశీయ శుద్ధీకరణ సామర్థ్యాన్ని పెంచేందుకు రాజస్థాన్ బార్మర్, అస్సాం నుమాలిగఢ్ రిఫైనరీలు వేగంగా పూర్తవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్లో కొత్త మెగా ప్లాంట్లు రానున్నాయి, పశ్చిమ తీరంపై దృష్టి సారించారు. 100 శాతం సామర్థ్యం లేని యాజమాన్య యూనిట్ల బదులు కొత్త మౌలిక సదుపాయాలు దీర్ఘకాల భద్రత ఇస్తాయి.
పునరుత్పాదక ఇంధనం..
స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను బలోపేతం చేస్తూ, గ్రీన్ హైడ్రోజన్, సౌర-పవన శక్తి వంటి శుభ్ర ఇంధనాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇవి పర్యావరణ రక్షణకు సహాయపడుతూ, జాతీయ భద్రతను మరింత రక్షిస్తాయి. అత్యవసర కాలంలో స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతోంది.
పశ్చిమాసియా ఘర్షణలు శిలాజ ఇంధన ఆధారాల ప్రమాదాన్ని బహిర్గతం చేశాయి. ప్రపంచ దేశాలను స్వావలంబన వైపు మళ్లించాయి. భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గ్రీన్ ఎనర్జీ విస్తరణ, ఇథనాల్ పెంపు, చమురు నిల్వల పెరుగుదల ద్వారా ఆర్థిక వ్యవస్థను కుదుపులకు తట్టుకునేలా తయారుచేస్తోంది.