కాంగ్రెస్ వాసనలు తొలగిస్తున్న మోడీ

దేశంలోని చాలా విమానాశ్రయాలు, నగరాల్లోని కాలనీలు సహా ఏ అభివృద్ధి పథకానికైనా, ఏ సంక్షేమ  పథకమైనా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రధానుల పేర్లే ఉండేవి. అలా కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో వారి వారసత్వపు ప్రధానుల పేర్లు పెట్టేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సహా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ ఇలా చాలా మంది కాంగ్రెస్ ప్రధానుల పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. కాంగ్రెస్ తరువాతి ముఖ్యమంత్రులు, ప్రధానులు ఇలా తమ వారి పేరును పెట్టుకున్నారు. అయితే కాలం […]

Written By: NARESH, Updated On : August 7, 2021 10:06 am
Follow us on

దేశంలోని చాలా విమానాశ్రయాలు, నగరాల్లోని కాలనీలు సహా ఏ అభివృద్ధి పథకానికైనా, ఏ సంక్షేమ  పథకమైనా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రధానుల పేర్లే ఉండేవి. అలా కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో వారి వారసత్వపు ప్రధానుల పేర్లు పెట్టేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సహా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ ఇలా చాలా మంది కాంగ్రెస్ ప్రధానుల పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. కాంగ్రెస్ తరువాతి ముఖ్యమంత్రులు, ప్రధానులు ఇలా తమ వారి పేరును పెట్టుకున్నారు.

అయితే కాలం మారింది.. కాంగ్రెస్ ఖతమైంది. దేశంలో రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ వాసనలు కూడా పోతున్నాయి. పోయేలా చేస్తున్నాడు ప్రధాని నరేంద్రమోడీ. దేశంలో ఇప్పుడు బీజేపీ తరుఫున కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. గుజరాత్ కు చెందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ సహా ఎంతో మందిని తెరపైకి తీసుకొచ్చి బీజేపీ, హిందుత్వ భావాలతో పోరాడిన నేతల గురించి నేటి సమాజానికి మోడీ బ్యాచ్ పరిచయం చేస్తోంది.

తాజాగా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’. ఈ పేరును కూడా తాజాగా మోడీ మార్చేశాడు. ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా మారుస్తూ మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నెపాన్ని ప్రజలపై నెట్టి మోడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

భారతదేశంలో ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని మాజీ కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92 లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా పిలుస్తున్నారు. ఈ అవార్డు కింద ఒక ప్రశంసాపత్నం, నగదు పురస్కారం అందిస్తారు.. ఏడాది కాలంలో ఆ క్రీడాకారుల ప్రదర్శనతో ఈ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాసనలు మార్చేసి ప్రధాని మోడీ దేశంలోనే అత్యున్నత హాకీ లెజెండ్ క్రీడాకారులు అయిన ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చేశారు.

మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడిగా పేరుపొందాడు. ఆయన జట్టు వరుసగా మూడు సార్లు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజు ఆగస్టు 29ను క్రీడా దినోత్సవంగా జరుపుతారు. ఇప్పుడు ఒలింపిక్స్ లో హాకీ ఇండియా అద్భుత ప్రదర్శనతో మోడీ సర్కార్ ఏకంగా క్రీడా పురస్కారం పేరు మార్చేసి షాకిచ్చింది.

అయితే కాంగ్రెస్ ప్రధాని పేరు మార్పుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది? దీన్ని వ్యతిరేకిస్తుందా? లేదా? దేశ క్రీడారంగం ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.