https://oktelugu.com/

ఒకే దెబ్బతో అందరి నోళ్లు మూయించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఒకే ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయించాడు. వ్యాక్సిన్ల కొరతకు కేంద్రానిదే పాపం అన్న రాష్ట్రాలకు కర్రుకాల్చి వాతపెట్టారు. వ్యాక్సిన్లు ఇచ్చినా పంచలేని వారి నిస్సహాయతను కళ్లకు కట్టారు. వ్యాక్సిన్లను సేకరించుకోమని వదిలిపెడితే ఒక్క రాష్ట్రం ఒక్క టీకా కూడా కొనలేదని.. ఇదీ మీ శక్తిసామర్థ్యాలని ఎండగట్టారు. అంతేకాదు.. మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న వారికి జ్ఞానబోధన చేశారు. తాజాగా దేశమంతా ఉచిత వ్యాక్సినేషన్ చేస్తామని.. అందరికీ 8 నెలల పాటు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2021 / 07:09 PM IST
    Follow us on

    ప్రధాని నరేంద్ర మోడీ ఒకే ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయించాడు. వ్యాక్సిన్ల కొరతకు కేంద్రానిదే పాపం అన్న రాష్ట్రాలకు కర్రుకాల్చి వాతపెట్టారు. వ్యాక్సిన్లు ఇచ్చినా పంచలేని వారి నిస్సహాయతను కళ్లకు కట్టారు. వ్యాక్సిన్లను సేకరించుకోమని వదిలిపెడితే ఒక్క రాష్ట్రం ఒక్క టీకా కూడా కొనలేదని.. ఇదీ మీ శక్తిసామర్థ్యాలని ఎండగట్టారు. అంతేకాదు.. మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న వారికి జ్ఞానబోధన చేశారు. తాజాగా దేశమంతా ఉచిత వ్యాక్సినేషన్ చేస్తామని.. అందరికీ 8 నెలల పాటు రేషన్ ఉచితంగా అందిస్తామని.. వచ్చే నవంబర్ లోపు దేశం మొత్తం 18-45 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ చేస్తామని.. ఇలా మోడీ ప్రకటనలతో ఇప్పుడు అందరి నోళ్లకు మూతపడింది.

    కరోనా మొదటి వేవ్ లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. దేశమంతటా కరోనా విస్తరించకుమందే లాక్ డౌన్ విధించింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యం, పప్పులు, జన్ ధన్ ఖాతాల ద్వారా నగదు బదిలీ, దేశమంతా ఉచితంగా ఇచ్చింది. ఆర్ధిక రంగం పుంజుకోవడానికి వివిధ రంగాలకు సుమారు 22 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడుతున్న సమయంలో కరోనా రెండో వేవ్ ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభావితం చేసి, ఎక్కువ మంది మరణాలకు కారణం ఐనది.

    సాధారణం గా ఉండే రోజుకి 1500 టన్నుల ఆక్సీజన్ డిమాండ్ ఉంటే.. దేశంలో 8,500 టన్నులకు పీక్ డిమాండ్ కి చేరుకుంది. ప్రపంచంలో ఎక్కడ ఆక్సీజన్ కంటైనర్ ఉన్నా భారత్ ప్రభుత్వం కొనుగోలు చేసి, మిలిటరీ విమానాల్లో తరలించారు. పారిశ్రామిక ఆక్సిజన్ ను మార్పులు చేసి రోగులకు అవసరమైన విధంగా నెల రోజుల్లోనే డిమాండ్ తీర్చగలిగింది.

    ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అంతా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నది అని రాష్ట్రాలను పనిచేయనీయడం లేదని, వాక్సిన్లు మేమే కోనుగోలు చేస్తామని నరేంద్రమోదీ ని ఒత్తిడి చేశాయి. లాక్డౌన్ విధించే స్వేచ్ఛ, ఔషధాలు కొనుగోలు ,వ్యాక్సిన్ కొనుగోలు స్వేచ్ఛ తమకే ఉండాలి అని డిమాండ్ చేశారు. ఆక్సీజన్ మాత్రం కేంద్రమే కొనుగోలు చేసి తమకు ఇవ్వాలి అన్నారు. చివరికి ఏమయ్యింది ? వ్యాక్సిన్ కొనుగోలు కోసం వేసిన గ్లోబల్ టెండర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి . కమీషన్ల కోసం తామే కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు వాక్సిన్లు కొనుగోలు చేయలేక బిక్క మొహం వేసాయి.

    పంజాబ్ ప్రభుత్వం కక్కుర్తి పడి కేంద్రం వద్ద ₹400 రేటుకు వ్యాక్సిన్ కొనుగోలు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ కి ₹1200కి అమ్ముకున్నారు. ఈ కుంభకోణం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ కుదిపేసింది. ఇక రాజస్థాన్ లో లక్షలాది వాక్సిన్లు కావాలని పారవేసి చెత్త కుప్పల పాలు చేశారు. ఇక దేశంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ కూటమి కేంద్ర ప్రభుత్వం లో ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగేదో ! ఇక లాభం లేదు అని ,దేశమంతా తానే వాక్సినేషన్ సప్లై చేస్తామని నిర్ణయం తీసుకున్న నరేంద్రమోదీ కి హ్యాట్సాఫ్ అని అన్ని వర్గాల నుంచి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

    జూన్ 21 నుండి దేశంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితం వాక్సినేషన్, పేదలకు ఆహార రేషన్ ప్రకటించడం అతి గొప్ప చర్యగా మేధావులు సైతం ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇప్పటివరకు 23 కోట్ల వాక్సిన్లు వేయలేదు. 130 కోట్ల ప్రజలకు 260 కోట్ల వాక్సిన్లు లక్ష్యం పెట్టుకొని ,స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఎదురు పెట్టుబడులు పెట్టి చేసే ఈ మహా యజ్ఞం, నభూతో న భవిష్యత్ అనే విధంగా నెరవేర్చే దమ్ము నరేంద్రమోదీ కి తప్ప ఎవరికీ లేదు. ఇప్పుడు మోడీ ప్రకటించిన నిర్ణయాలతో అటు రాష్ట్రాలకు.. ఇటు ప్రతిపక్షాలకు నోట మాటరాని పరిస్థితి నెలకొంది.