Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి చుక్కెదురైంది. ప్రధాని మోదీ నుంచి ప్రతికూలత ఎదురైంది. ఏబీవీపీ కార్యకర్తగా మొదలుపెట్టి.. జనసంఘ్, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సుదీర్ఘకాలం ఆ పార్టీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యను రాష్ట్రపతి పదవి విషయంలో మోదీ విస్మరించారు. ఎల్కే ఆడ్వాణీని, ఆయన టీమ్‌ను పక్కన పెడుతూ, తన సొంత టీమ్‌ను నిర్మించుకుంటూ వస్తున్న మోదీ.. వెంకయ్యను కూడా పక్కన పెట్టారు. నిజానికి వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు నిరాకరించినప్పుడు కూడా మోదీ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. మొదటినుంచీ మోదీకి వెంకయ్య అండగా ఉన్నా ఆయనను దూరంగా ఉంచేందుకే మోదీ ప్రయత్నించారు. ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని ఆ పదవి నుంచి తొలగించాలని నాటి ప్రధాని వాజపేయి పట్టుబట్టగా, ఆడ్వాణీ టీమ్‌లో భాగంగా వెంకయ్య.. మోదీకి అండగా నిలిచారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మోదీని సమర్థించారు. 2014లో మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని సంఘ్ నిర్ణయించినప్పుడు కూడా ఆడ్వాణీకి వెంకయ్య నచ్చజెప్పారు. ఆ తరువాత మోదీ తొలి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య.. మోదీ విధానాలను సమర్థించారు. అనంతరం ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా కూడా మోదీ ప్రభుత్వ మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్నారు. ఇటీవల మోదీపై వెలువడిన పుస్తకాన్ని వెంకయ్యే ఆవిష్కరించారు. కాగా మంగళవారం వెంకయ్యను కలుసుకునేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బృందం.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తున్న విషయాన్ని ఆయనకు కనీసం చెప్పలేదు.

ఆ అవకాశమూ లేదు..
ఉప రాష్ట్రపతి హోదాలోని వ్యక్తికి రాష్ట్రపతిగా ప్రమోషన్ ఇచ్చిన సందర్భాలు దేశ చరిత్రలో పరిమితంగానే ఉన్నాయి. ఉపరాష్ట్రపతిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే, రాష్ట్రపతిగా ప్రమోషన్ పొందిన ఘనత అరుదైనది.గతంలో యూపీఏ హయాంలో ఉపరాష్ట్రపతికి రెండు పర్యాయాలూ కొనసాగింపును ఇచ్చినట్టుగా ఉన్నారు. ప్రమోషన్ అయితే ఇవ్వలేదు. ఇక కమలం పార్టీకి కూడా ప్రస్తుత ఉప రాష్ట్రపతికి రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా వార్తలు మొదటి నుంచి రాలేదు! గిరిజన లేదా ఎస్సీ కాదంటే ముస్లిం అభ్యర్థికి బీజేపీ వాళ్లు రాష్ట్రపతిగా ఈ సారి అవకాశం ఇవ్వనున్నారనే మాట ప్రముఖంగా వినిపించింది.తెరపైకి వచ్చిన పేర్లన్నీ ఆ కోటా లోవే! వారిలో ఎవరో తేల్చుకోవడానికి మాత్రం బీజేపీ సమయం తీసుకున్నట్టుగా ఉందిమరి ఈ సందడిలో తెలుగు మీడియా తనదైన అతిని చేసింది.
ఆఖరి గంటల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరును రాష్ట్రపతి అభ్యర్థి అంటూ హడావుడి చేసింది.వెంకయ్య నాయుడు ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు వెళ్లారని.. వారంతా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండమంటూ ఆయనను కోరినట్టుగా తెలుగు మీడియా ప్రచారం మొదలుపెట్టింది. వారికి మోడీ చెప్పి పంపించి ఉండవచ్చన్నట్టుగా హడావుడి చేసింది. ఇన్నాళ్లుగా వినిపించని పేరును బీజేపీ అధికారిక ప్రకటన వచ్చే ముందు హడావుడిగా తెరపైకి తెచ్చారు.తెలుగు మీడియా ఇలా వెంకయ్య పేరును ప్రచారం తెచ్చినంతలోనే కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటూ ప్రకటించేశారు.
తెరపైకి ముక్తార్ అబ్బాస్ నక్వీ..
ఉపరాష్ట్రపతికి సంబంధించి వెంకయ్యనాయుడుకు ప్రమోషన్ లేనట్టు తెలుస్తోంది. ఆ పదవికి కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని నిలబెట్టే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. నక్వీ రాజ్యసభ పదవీకాలం ఇటీవల ముగిసినప్పటికీ మళ్లీ అవకాశమివ్వలేదు. యూపీలోని ఆయన స్వస్థలం రాంపూర్ లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బరిలోకి దించలేదు. ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసేందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

అయితే వెంకయ్య విషయంలో బీజేపీ పెద్దలు ఆడుతున్న గేమ్ ఎవరికీ అంతు పట్టడం లేదు. మరీ ముఖ్యంగా ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యమంటూ లేదు. కేంద్ర మంత్రివర్గంలో పక్కన తెలంగాణాలో కిషన్ రెడ్డి రూపంలో సముచిత స్థానం కల్పించిన ఏపీ విషయంలో మాత్రం విస్మరించారు. ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన వారికి కనీసం సహాయ మంత్రి అయిన ఇవ్వలేదు. ఎలాగాలో వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నారని ఇన్నాళ్లూ సరిపెట్టుకొని వస్తున్నారు. కానీ అది కూడా ఆగస్టు నాటికి దూరం కానుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులే వెంకయ్యకు ఈ దుస్థితికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ వెంకయ్య విషయంలో చాలా వ్యతిరేకత కనబరిచింది. చాలా సందర్భాల్లో సైతం ఇది కనిపించింది. వెంకయ్య కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఒకానొక సందర్భంలో ఎంపీ విజయసాయిరెడ్డి వెంకయ్యపై కీలక వ్యాఖ్యానాలు చేశారు. ఆయన మనిషైతే బీజేపీ కానీ.. ఆయన మనసంతా పసుపు పార్టీదేనంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తరువాత ఆ మాటలను వెనక్కి తీసుకున్నారు. ఇటీవల సన్నిహితంగా కూడా మెలిగారు. కానీ రాష్ట్రపతి పదోన్నతి, ఉప రాష్ట్రపతి రెన్యూవల్ విషయంలో మాత్రం వైసీపీ వ్యతిరేకత కనబరచినందు వల్లే ఆయనకు మోదీ పరిగణలోకి తీసుకోలేదన్న టాక్ మాత్రం నడుస్తోంది.
Also Read:PK Survey Report On Telangana: పీకే సర్వేతో కేసీఆర్ లో గుబులు మొదలైందా?