Jr NTR: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నందమూరి బాలకృష్ణ కి ఎలాంటి మాస్ ఫ్యాన్ బేస్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అసలు మాస్ అనే పదానికి పర్యాయపదం ఆయన..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ రావు గారి నటవారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన బాలయ్య కెరీర్ ప్రారంభం నుండే తనదైన శైలి లో అద్భుతంగా నటిస్తూ అశేష ప్రజాభిమానం ని చూడగొన్నారు..బాలయ్య బాబు తర్వాత నందమూరి కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మినహా ఒక్కరు కూడా గ్రాండ్ గా సక్సెస్ కాలేకపోయారు..మధ్యలో కళ్యాణ్ రామ్ రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తళుక్కుమని మెరిసిన కూడా బాలయ్య బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ లా అదే స్టార్ స్టేటస్ ని మైంటైన్ చేయలేకపోయారు..జూనియర్ ఎన్టీఆర్ #RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించి నందమూరి వంశ గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టాడు..ఇది ఇలా ఉండగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ తన జీవితాతం లో చోటు చేసుకున్న కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

బాలయ్య బాబు వెండితెర మీద డైలాగ్ చెప్పిన డాన్స్ వేసిన థియేటర్ లో ఉన్న అభిమానులందరూ ఊగిపోవడం సర్వ సాధారణం..అయితే చిన్నప్పటి నుండి బాలయ్య బాబు మరియు ఎన్టీఆర్ సినిమాలు చేస్తూ పెరిగిన జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు సినిమా విడుదల అయ్యిందంటే మొదటి రోజు మొదటి ఆట థియేటర్ లోనే చూస్తాడట..అలా ఆయన నరసింహ నాయుడు సినిమా కూడా చూసాడు..ఈ సినిమా లక్స్ పాప సాంగ్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అత్యుత్సాహం తో ఎంజాయ్ చేస్తూ ఆ ఊపులో ముందున్న సీటుని కాళ్లతో గట్టిగ తన్నాడట..ఎన్టీఆర్ దెబ్బకి సీట్ కూడా విరిగిపోయిందట..ఈ విషయాన్నీ స్వయంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు..ఆ రోజుల్లో నరసింహ నాయుడు చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..అమెరికా నుండి అనకాపల్లి వరుకు ఈ సినిమా చేసిన బాక్స్ ఆఫీస్ బాటింగ్ ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు..ఆ కాలం లో ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Also Read: Ravi Teja Becomes Director: డైరెక్టర్ గా మారిన రవితేజ..తొలి సినిమా ఆ హీరో తో??
https://www.youtube.com/watch?v=byfC-asZnMk
[…] […]