Tamil Star Hero Vijay: కోలీవుడ్ లో ప్రస్తుతం ఇళయతలపతి విజయ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో అభిమానులను అలరిస్తున్న విజయ్ కి మన తెలుగులో కూడా ఇటీవల బాగా క్రేజ్ పెరిగిపోయింది..ఇవన్నీ పక్కన పెడితే విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని చాలా కాలం నుండి మీడియా లో ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన రాజకీయాల్లోకి భవిష్యత్తులో వస్తాడో లేదో తెలియదు కానీ..ఆయన అభిమానులు మాత్రం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ అనే పార్టీ ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు..ఇండియాలో అభిమానుల చేత స్థాపించబడిన ఏకైక పార్టీ ఇదే అనే చెప్పొచ్చు..ఈ పార్టీకి సంబంధించిన భవనం చెన్నై లోని పనైయూర్‌లో ఉన్నది..అయితే ఇటీవల ఈ పార్టీ భవనం సమీపం లో ఒక మృత దేహం దొరకడం తమిళనాడు లో సెన్సషనల్ టాపిక్ గా మారింది..అనుమానాస్పద స్థితిలో పార్టీ ఆవరణలో పడున్న ఈ డెడ్ బాడీ ని చూసి స్థానికంగా ఉన్న ప్రజలు భయపడిపోయారు.

Also Read: Akash Puri: చెల్లితో లవర్ గా నటించడానికి ససేమిరా అన్న హీరో
ఇంతకీ అసలు ఏమి జరిగిందంటే చెన్నై లోని పనైయూర్‌లో ఉన్న విజయ్ పార్టీ ఆఫీస్ ని రేనోవేషన్ చేస్తున్నారు..ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలు అన్నిటిని పర్యవేక్షించడం కోసం ప్రభాకరన్ అనే కాంట్రాక్టర్ ని పెట్టుకున్నారు..అయితే కొద్దీ రోజుల క్రితం కుటుంబం ని కలవడం కోసం సొంత ఊరుకెళ్ళిన ప్రభాకరన్ అనుకోకుండా మొన్న గురువారం రాత్రి భవనం వద్దకి మద్యం తాగి వచ్చాడట..అక్కడ ఉన్న సూపర్ వైజర్ దగ్గరకి వెళ్లి ‘నాకు పరోటా కావలి..అర్జెంటు గా వెళ్లి తీసుకొని రా’ అంటూ గోల చేసాడట..పరోటా తీసుకొచ్చిన తర్వాత రెండవ ఫ్లోర్ కి తినడానికి వెళ్ళాడట..మరుసటి రోజు అక్కడకి పని చెయ్యడానికి వచ్చిన వాళ్ళు ప్రభాకరన్ మృత దేహం ని చూసి కంగుతిన్నారట..అతని నోట్లో పరోటా కూడా ఉన్నట్టు సమాచారం..పూర్తిగా అనుమానాస్పద పరిస్థితి లో ఉన్న ఈ మృతదేహం ని పోస్టు మార్టం కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..త్వరలోనే అసలు ఏమి జరిగిందనే నిజానిజాలు బయటపెడుతాము అని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు..ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన హీరో గా నటించిన బీస్ట్ సినిమా విడుదలై యావేరేజి గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన తెలుగు దర్శకుడు వంశి పైడిపల్లి తో ఒక్క సినిమా చేస్తున్నాడు..ఇది విజయ్ కి తెలుగు లో మొదటి డైరెక్ట్ సినిమా..ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విజయ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని విడుదల చేసారు..ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు.

Also Read: Ram- Boyapati Movie: రామ్ – బోయపాటి మూవీ లో బాలయ్య బాబు