Modi Historic Achievement: నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2014, 2019లో సంపూర్ణ మెజారిటీ సాధించింది. 2024లో మాత్రం ఒంటరిగా మెజారిటీ రాలేదు. దీంతో కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరుసగా మూడుసార్లు ప్రధాని అయి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు మోదీ. తాజాగా ఆయన మరో మైలురాయిని అధిగమించారు. నెహ్రూ తర్వాత ఎక్కువకాలం ప్రధాని పదవి చేపట్టిన నేతగా రెండోస్థానంలో నిలిచారు. ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును దాటేశారు.
Also Read: ఐదేళ్లలో రూ.326 కోట్లు.. మోదీ ఫారిన్‌టూర్ ఖర్చు
చారిత్రాత్మక మైలురాయి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ చరిత్రలో రెండో అత్యధిక కాలం పదవీస్థాయిలో ఉన్న ప్రధానమంత్రిగా నిలిచారు. 2025 జూలై 25 నాటికి, 2014 మే 26 నుంచి వరుసగా 4,078 రోజులు పదవిలో కొనసాగి, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (4,077 రోజులు) రికార్డును అధిగమించారు. జవహర్‌లాల్ నెహ్రూ (16 సంవత్సరాలకు పైగా) తర్వాత ఈ స్థానంలో మోదీ నిలిచారు. స్వంతంత్య్ర భారత దేశలో జన్మించి ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా మోదీ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రం(గుజరాత్) నుంచి వచ్చిన ఆయన అత్యధిక కాలం పదవిలో ఉన్న నాయకుడిగా నిలిచారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా సేవలందించిన ఆయన, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Also Read: రైతుల ఖాతాలో రూ.7,000.. ముహూర్తం ఫిక్స్!
విజయాల్లో రికార్డు..
మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2014, 2019, మరియు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. నెహ్రూ తర్వాత ఇటువంటి విజయం సాధించిన ఏకైక నాయకుడు మోదీ. అంతేకాక, గుజరాత్‌లో మూడు రాష్ట్ర ఎన్నికలు, జాతీయ స్థాయిలో మూడు ఎన్నికలతో కలిపి, ఆరు వరుస ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించిన ఏకైక నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. విజయం సాధించడమే కాకుండా.. పాలనలోనూ స్థిరత్వం సాధించారు. తన పాలనలో గణనీయమైన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ, విదేశీ విధానంలో మార్పులు చూడవచ్చు. ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ రూపురేఖలను మార్చాయి. అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది.