Next Vice President of India: భారత ఉపరాష్ట్ర పదవి ఎవరిని వరిస్తుందని విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఆరోగ్య కారణాలతో జగదీష్ ధన్కర్
రాజీనామా చేయడం, ఆమోదించడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయ్యింది. అందుకు సంబంధించి
నోటిఫికేషన్ జారీ చేసింది.
రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
Also Read: ఐదేళ్లలో రూ.326 కోట్లు.. మోదీ ఫారిన్‌టూర్ ఖర్చు
సందట్లో సడేమియా..
దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో తమ ప్రాబల్యం చాటుకునేందుకు, ఈ ఎన్నికలను అవకాశంగా చేసుకొని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉపరాష్ట్రపతి పదవికి అర్హులైన వారిని ఎంపిక చేయడం విషయంలో ఉభయ సభల్లో మెజార్టీ స్థానాలు ఉన్న ఎన్డీఏ ఒక అభ్యర్థిని పోటీలో నిలుపుతారు. ఈ విషయంలో మిగతా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతకృత్యులయ్యారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న ప్రతిపాదనను బీజేపీ పరిగణలోకి తీసుకోవడం, తీసుకోకపోవడం ఆ పార్టీ స్ట్రాటజీపై ఆధారపడి ఉంటది.
ఎలక్ట రోల్ కాలేజీలో మెజార్టీ స్థానాలు ఉన్న బీజేపీ ప్రతిపాదించే నాయకుడే ఉపరాష్ట్రపతి పీఠం అధిష్టించేందుకు అవకాశాలు ఉన్నాయి.
ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది..?
భారతీయుడై ఉండి, రాజ్యసభలో సభ్యత్వం ఉన్న వారు ఈ పదవికి పోటీ చేసేందుకు అర్హులు. పోటీ చేసే వారిని 20 మంది ప్రపోజ్ చేయాలి, మరో 20 మంది సెకండ్ చేయాల్సి ఉంటుంది.
పరోక్ష పద్ధతి లో జరిగే ఈ ఎన్నికలను ఎలక్ట రోల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. 543 లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు 245 ఉంటారు. ఒక్కో సభ్యుడి ఓటు విలువ 700 పాయింట్లు ఉంటాయి. ప్రాధాన్యత ఓట్ల ప్రాతిపదికన 50 శాతం ఓట్లు కన్నా ఎక్కువ వచ్చిన వారు ఎన్నికవుతారు. ఎన్నికైన వారికి 5 సంవత్సరాల వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. ఎలక్ట రోల్ కాలేజీలో
రాజ్యసభలో 292 మంది, లోక్ సభలో 542 మంది ఉండగా మొత్తం 786 మంది సభ్యులు
ఉన్నారు. వీరిలో ఎన్డీఏకు లోక్ సభలో 293, రాజ్యసభలో 129, మొత్తం 422 మంది మెజార్టీ సభ్యులు ఉన్నారు.
Also Read: అమెరికా, నాటో, ఈయూ బెదిరింపులు.. భారత్ తగ్గేదేలే
రేసులో ఎవరెవరు.?
బీజేపీ నుంచి రేసులో ఉన్నవారిలో కీలకమైన వ్యక్తులు ఆరుగురు ఉన్నారు. వారిలో నితీష్ కుమార్, మనోజ్ సింహ, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, హరివంశ నారాయణ సింగ్, వీకే సక్సేనా, శశి ధరూర్ పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో
ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో కర్ణాటక గవర్నర్ గా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు 77 ఏళ్లు, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు, నాలుగుసార్లు లోక్ సభ, నాలుగుసార్లు రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
ఓం ప్రకాష్ మాధుర్ (73) సిక్కిం గవర్నర్ గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్న ఆయన బీజేపీ లో చేరారు. మోడీ, అమిత్ షా కు చాలా దగ్గరి వ్యక్తి గా ఉన్నారు. పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేశారు. రాజస్తాన్ నుంచి సీనియర్ లీడర్. గుజరాత్ ఎన్నికల ఇంచార్జి గా వ్యవహరించారు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న హరివంశ నారాయణ సింగ్ పేరు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ వ్యూహం ఏంటీ..
ఎన్డీఏ కు స్పష్టమైన మెజార్టీ ఉండడంతో బీజేపీ ఈ విషయంలో ఎవరిని రంగంలోకి దింపుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి చెందిన ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయవచ్చని కూడా భావిస్తున్నారు. మిత్ర పక్షానికి చెందిన జనతాదళ్ కు చెందిన వారిని ఎన్నుకోవచ్చని, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకునేందుకు నిర్మల సీతా రామన్, పురంధరేశ్వరి పేర్లు ప్రతిపాదనకు రావచ్చని భావిస్తున్నారు. బీజేపీ చివరికి ఎవరిని ప్రతిపాదిస్తారో వేచిచూడాల్సిందే..