Modi: మోడీ 3.O: ఫస్ట్ 125 డేస్ లోనే పక్కా ప్రణాళికతో.. భారీ స్కెచ్.. ఈ సారి యువతే టార్గెట్..

ఇండియా టుడే గ్రూప్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మొదట నేను గెలవబోయే ఎన్నికల్లో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధ్యక్షుడు పుతిన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది.

Written By: Neelambaram, Updated On : May 18, 2024 5:29 pm

Modi

Follow us on

Modi: లోక్ సభ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని, ఈ సారి 400 సీట్లు వస్తాయని మోడీ ఎన్నికలకు ఆరు నెలల నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక వేళ ఈ ఎన్నికల్లో తాను గెలుపొందితే పక్కా ప్రణాళిక ఉందని, గతమంతా ట్రైలర్ మాత్రమే నని, అసలు సినిమా ఇప్పుడు స్ట్రాట్ అవుతుందని మోడీ తన ప్రసంగాల్లో, ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు.

ఇండియా టుడే గ్రూపునకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన మూడో పదవీకాలం (3.O) మొదటి 100 రోజులకు బ్లూప్రింట్ సిద్ధంగా ఉందని, ఈ సారి స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశంలోని యువత కోసం మరో 25 రోజులు ప్లాన్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు.

యువత, వారి భవిష్యత్ పై ఎప్పుడూ దృష్టి సారించే తాను ఎన్నికల ప్రచారంలో తొలిసారి ఓటు వేసే వారి ఉత్సాహాన్ని చూసి 125 రోజుల పాటు బ్లూప్రింట్ గురించి ఆలోచించాల్సి వచ్చిందన్నారు. వారు స్ఫూర్తి చాటారన్నారు. అందుకే 125 రోజుల ప్రణాళిక రూపొందించాలనుకుంటున్నానని చెప్పారు. ‘100 రోజుల కోసం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాను. మరో 25 రోజులు అదనంగా ఇవ్వాలనుకుంటున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు.

దేశంలోని యువత తమ ఆలోచనలను వినిపించాలని, వారి ప్రాధాన్యతలను జాబితాగా మలచాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. మొత్తం 25 రోజులను దేశ యువతకు అంకితం చేయాలనుకుంటున్నాను. 100 రోజుల నుంచి ముందుకెళ్తున్నాను అందుకే వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న’ అని ప్రధాని మోదీ అన్నారు.

అంతకుముందు, మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ.. తాను ఇప్పటికే తన మొదటి 100 రోజుల ఎజెండాపై సమావేశాలు నిర్వహించడం ప్రారంభించానని, నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి జాప్యాన్ని చేయబోనని చెప్పారు. జూన్ 4 తర్వాత 100 రోజుల ప్రణాళికను వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు.

ఇండియా టుడే గ్రూప్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మొదట నేను గెలవబోయే ఎన్నికల్లో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధ్యక్షుడు పుతిన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. సెప్టెంబర్ సమావేశం ఆహ్వానం కోసం. జీ-7 దేశాల నుంచి పిలుపు వచ్చిందని, ఈ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రపంచం పూర్తి విశ్వాసంతో ఉంది’ అన్నారు.

తమ పార్టీ నాయకులు ఎన్నికల్లో పాల్గొనడం గురించి అడిగినప్పుడు.. ప్రధాని మోడీ ఇలా అన్నారు. ‘అభ్యర్థి కోసం వేచి చూడవద్దు మీ అభ్యర్థి కమల్ (కమలం). కమల్ (కమలం) తప్ప మరెవరూ లేరు. కాబట్టి కమలం వికాసం కోసమే పని చేయాలి’ అని చెప్పాను. ‘అందుకే మేమంతా కమల్ కోసం పని చేస్తున్నాం. నేను కూడా కమల్ కోసం పని చేస్తున్నాను. నా తోటి నాయకులు కూడా కమల్ కోసం పని చేస్తున్నారు. మా ప్రత్యర్థులు కూడా కమల్ కోసమే పనిచేస్తున్నారు. ఎందుకంటే వారు ఎంత ఎక్కువ బురద విసిరితే అంతగా కమలం వికసిస్తుంది.. కాబట్టి వారు ఆ పని చేస్తున్నారు. మేము కమలం గురించి మాట్లాడుతున్నాము.’ అన్నారు.

ఈ సంవత్సరాన్ని సౌకర్యవంతమైన ఎన్నికలుగా పేర్కొనవచ్చా? అని అడిగినప్పుడు, ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘మేము ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లోకి వెళ్లలేదు. సౌకర్యంగా కంటే ఛాలెంజ్ గా పని చేయడం అంటేనే నాకు ఇష్టం. సౌకర్యవంతమైన దారిలో వెళ్తే.. ప్రమాదం వస్తే తప్పించుకునే టాలెంట్ ఉండదు. నేను నా నాయకులను అప్రమత్తంగా.. ఉంచాలనుకుంటున్నాను. నేను వాటిని నడపాలనుకుంటున్నాను. కాబట్టి కంఫర్ట్ జోన్ ను నేను అంగీకరించను.’ అని సమాధానంగా చెప్పారు.

లోక్ సభ ఎన్నికల గురించి, ప్రచార దశలో కష్టపడి పనిచేయడం గురించి మోడీ మాట్లాడుతూ.. ‘నా కోసం నేను ప్రజలను కలుస్తున్నాను. వారి భావాలను అర్థం చేసుకోవడమే నా శక్తి. రెండోది.. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనే పరిమిత కోణంలో ఎన్నికలను తీసుకోవద్దు. ఒక రకంగా ఇది చాలా పెద్ద ఓపెన్ యూనివర్సిటీ.