MLC polls: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలుండగా అందులో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు, స్థానిక సంస్థల కోటాలో 11 మందిని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. వైసీపీ నుంచి డీసీ గోవింద్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ చైర్మన్ మహ్మద్ షరీఫ్, బీజేపీ నుంచి సోము వీర్రాజు పదవీ విరమణ చేయడంతో వీరి స్థానాలు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల కోటాలో 11 మందికి సంబంధించిన జాబితాను అధినేత పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 14 మంది సభలో ప్రవేశిస్తే వైసీపీ బలం 32కి పెరగనుంది. దీంతో చట్టాల రూపకల్పనకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే శాసనమండలిని రద్దు చేయాలని వైసీపీ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఇప్పుడు సంఖ్య పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎస్సీ, మహిళకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో 11 స్థానాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలలో రెండు, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఖాళీలున్నట్లు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ సామాజిక సమీకరణల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కోసం అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Roja Kabaddi: ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడితే ఎట్టుంటాదో తెలుసా?
2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ నియామకాలతో అందరిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో జగన్ తుది జాబితా తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్రాంతాలు, సామిజిక, ఆర్థిక తదితర కారణాలు చూస్తూ అభ్యర్థులను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనున్నట్లు చెబుతున్నారు.
Also Read: Sea sink to AP: ఏపీ సముద్రతీరం ముందుకొస్తోందా? ఊర్లు మునగడం ఖాయమా?