Homeఆంధ్రప్రదేశ్‌MLC Elections: తెలుగు స్టేట్లలో మొదలు కానున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

MLC Elections: తెలుగు స్టేట్లలో మొదలు కానున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

MLC Elections: తెలుగు స్టేట్లలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగనుంది. ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం సంకల్పించింది. ఇందులో భాగంగా తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్ లో 14 స్థానాలకు గాను ఇవాళ నోటిఫికేషన్ వెలువరించనుంది. దీంతో అధికార పార్టీలు టీఆర్ఎస్, వైసీపీలు వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.
MLC Elections
ఇందులో భాగంగా ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 17 నుంచి నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ, 29న పోలింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. ఆశావహుల్లో అప్పుడే ఆశలు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు, స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలు ఖాళీలున్నాయి. తెలంగాణలో మూడు ఎమ్మెల్యే కోటాలో ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించడంతో ఎలాగైనా పదవులు దక్కించుకునేందుకు నేతలు పైరవీలు చేస్తున్నారు.

Also Read: Amit Shah: 14న అమిత్ షాతో కేసీఆర్, జగన్ భేటి? మతలబేంటి?

ఏపీ శాసనమండలిలో 58 స్థానాలుండగా అధికార పార్టీ వైసీపీకి 18 స్థానాలున్నాయి. ప్రస్తుతం 14 స్థానాలు భర్తీ చేస్తే వైసీపీ బలం పెరిగి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తన సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో సందడి వాతావరణం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: KCR vs Bandi: కేసీఆర్‌, బండి డిష్యుం డిష్యుం వెనుక…

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version