‘Honeymoon’ history : ‘హనీమూన్’ పేరు ఎలా వచ్చింది..? పెళ్లయిన కొత్త జంట హనీమూన్ కు ఎందుకు వెళ్తారు..?

‘Honeymoon’ history : కొత్తగా పెళ్లయిన జంటకు ఆ సమయంలో స్వర్గం కనిపిస్తుంది. ఇద్దరు భిన్న వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారి భావాలు, ఆలోచనలు పంచుకునేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే భారతదేశంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన జంటకు వారి భావాలను పంచుకోవడానికి, ఏకాంతంగా గడిపేందుకు ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో కొందరు ‘హనీమూన్’ అనే కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. పెళ్లయిన తరువాత కొత్త జంట కొన్ని రోజులపాటు ఏకాంతంగా గడపడానికి విహార యాత్రకు వెళ్లేందుకు […]

Written By: NARESH, Updated On : November 10, 2021 9:04 am
Follow us on

‘Honeymoon’ history : కొత్తగా పెళ్లయిన జంటకు ఆ సమయంలో స్వర్గం కనిపిస్తుంది. ఇద్దరు భిన్న వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారి భావాలు, ఆలోచనలు పంచుకునేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే భారతదేశంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉన్నాయి.

కొత్తగా పెళ్లయిన జంటకు వారి భావాలను పంచుకోవడానికి, ఏకాంతంగా గడిపేందుకు ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో కొందరు ‘హనీమూన్’ అనే కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. పెళ్లయిన తరువాత కొత్త జంట కొన్ని రోజులపాటు ఏకాంతంగా గడపడానికి విహార యాత్రకు వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు. ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాలకు కొత్త జంటను పంపుతున్నారు. పూర్వంలో కేవలం సంపన్న వర్గాలకు చెందిన వారు మాత్రమే హనీమూన్ యాత్ర చేసేవారు. కానీ రాను రాను మధ్య తరగతి వారూ హనీమూన్ ట్రిప్ చేస్తున్నారు. అయితే హనీమూన్ సాంప్రదాయం ఎప్పుడు మొదలైంది..? హానీమూన్ అనే పేరు ఎలా వచ్చింది..?

honnymoon

హనీమూన్ సాంప్రదాయం 1800 చివర్లో మొదలైంది. ఆ సమయంలో కొందరు సంపన్న వర్గాలకు చెందిన వారు పెళ్లయిన తరువాత కొన్ని రోజుల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అలా వెళ్లడాన్ని ‘పెళ్లయిన తొలినెల’ అని పిలిచేవారు. ఇదే క్రమంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుండడంతో నూతన జంట విహార యాత్రలను ఎక్కువగా చేయడం మొదలు పెట్టింది.

ఆధునిక యుగంలో పెళ్లయిన తరువాత కొత్త జంటతో పాటు కుటుంబ సభ్యులు కూడా చిన్న చిన్న ట్రిప్పులు వేసేవారు. కానీ రాను రాను కుటుంబాలు కాకుండా కేవలం పెళ్లయిన జంట మాత్రమే వెళ్తోంది. 8న వహెన్రీ పెళ్లయిన వెంటనే భార్య ఆన్ బోలీన్ తో కలిసి గ్లౌసెస్టర్ షైర్ లో ఉన్న థోర్న్ బరీ కోటలో వారం రోజులు గడిపారు. కొందరు తమకు సమయం అనుకూలంగా ఉంటే నెలరోజుల పాటు గడిపేవారు. వేసవిలో వివాహం జరిగితే చల్లటి ప్రాంతాలకు, శీతాకాలంలో జరిగితే దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లేవారు. మొత్తంగా చల్లగా ఉన్న ప్రాంతాలకు హనీమూన్ వెళ్లేందుకు ఇష్టపడుతారు. భారతదేశంలో రైలు మార్గం అభివృద్ధి చెందిన సమయంలో కార్మిక వర్గానికి చెందిన వారు కూడా హనీమూన్ ట్రిప్పులు ప్రారంభించారు. తమ బడ్జెట్ కు అనుగుణంగా సముద్ర తీరాలకు, ఇతర నగరాలకు పర్యటనలు కొనసాగించేవారు.

ఇవి కూడా చదవండి : వాట్సాప్ సెక్యూరిటీ కోడ్ నోటిఫికేషన్లు వస్తున్నాయా.. వాటిని ఎలా ఆపాలంటే?

1552లో హనీమూన్ అనే పదానికి అర్థం వివరించారు. 18వ శతాబ్దం మధ్యలో శామ్యూల్ జాన్ సన్ రాసిన డిక్షనరీలో ‘వివాహం జరిగిన కొత్తలో సంతోషం, సున్నితత్వం తప్ప ఇంకేమీ కనిపించదు’ అని వివరించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమ తగ్గుతుంది. ఇదే మాదిరిగా చంద్రుడు క్షీణించిన తరహాలోనే కొత్త జంట మధ్య ఉండే ప్రేమ తగ్గుతుందని అందుకే దీనికి హనీమూన్ అనే పేరు పెట్టారని అంటున్నారు.

మరో విషయంలో విక్టోరియన్లు 30 రోజుల పాటు తేనెతో ఒక మత్తు పదార్థాన్ని తయారు చేస్తారు. ఇది పెళ్లయిన జంటలో ఉండే ఉనందమే ఇక్కడా ఉంటుందని, అందుకే దానికి హానీమూన్ అని పెట్టారని అంటున్నారు. అయితే ఒకప్పుడు నెల రోజుల పాటు ఉండే హనీమూన్ యాత్ర రాను రాను మూడు రోజులకే పరిమితం అయింది. ఇక పెళ్లయిన కొత్త జంటను బంధాలకు నెల రోజుల పాటు దూరం చేయడమే ఈ సాంప్రదాయం అని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actress Suryakantham: సూర్యకాంతం గయ్యాళి అత్త కంటే ముందు డ్యాన్సర్ కూడా !