Sai Dharam Tej: విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో తాను స్టార్ హీరోయిన్ అయిపోతాను అంటూ బిల్డప్ ఇచ్చిన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నాను ఆ సినిమా బాగా నిరాశ పరిచింది. దాంతో టాలీవుడ్ నుండి కొంత బ్రేక్ తీసుకుంది ఈ బబ్లీ బ్యూటీ. ఈ లోపు తమిళ చిత్రాల నుంచి అవకాశాలు రావడంతో అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేసింది. అయినా అమ్మడుకు అక్కడ కూడా కాలం కలిసి రాలేదు.

ఆమె హీరోయిన్ గా చేసిన తుగ్లక్ దర్బార్, అరణ్మణై 3 చిత్రాలు రీసెంట్ గా విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్లాప్ అయ్యాయి. రాశి ఖన్నాలో మ్యాటర్ ఉంది గాని , యాక్టింగ్ లేదంటూ తమిళ క్రిటిక్స్ ఆమెను ఓ రేంజ్ లో విమర్శించారు. దీనికితోడు ఈ రెండు చిత్రాలు నెగిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడం.. అందుకు రాశి ఖన్నా కూడా ఒక కారణం కావడం మొత్తానికి ఆమెకు తమిళంలో కూడా గిట్టుబాటు కాలేదు.
అయితే, ఎన్నో ప్రయత్నాలు తర్వాత రాశి ఖన్నా మరో తమిళ చిత్రంలో ఒక అవకాశాన్ని దక్కించుకుంది. సుందర్ సి దర్శకత్వంలో రాశి ఖన్నా నటించనుంది. జీవా హీరోగా నటించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా రాశికి ఛాన్స్ వచ్చింది.
Also Read: Raghava Lawrence: జై భీమ్ సినిమా నిజ జీవిత పాత్ర “పార్వతమ్మ” కు… ఇల్లు కట్టిస్తా అన్న రాఘవ లారెన్స్
సాయి తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో రాశి ఖన్నాను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. కాకపోతే ఈ సినిమాలో ఆమె పరిధి దాటి ఎక్స్ పోజింగ్ చేయాల్సి ఉందట. ఎలాగూ, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి ఎప్పటి నుంచో గ్లామర్ డోస్ ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్న రాశి ఖన్నా, ఈ సినిమా కోసం ఏమైనా చేస్తాను అంటుంది. తనకు సాయి తేజ్ మంచి ఫ్రెండ్ అని రాశి చెప్పుకొచ్చింది.
Also Read: Vijay Setupathi: విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి రివార్డు ప్రకటన!