Telangana MLC : తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపేందుకు సర్వశక్తుల్ని ఒడ్డింది. 6 చోట్ల ఎలక్షన్స్ ఉండగా, అందుకు టీఆర్ఎస్ పక్కా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తీసుకెళ్లి చివరి వరకు వారితోనే ఉంచుకుని, ఓటింగ్ రోజున రంగంలోకి దించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ లో గెలుపు ఎలా అని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

క్యాంపులకు వచ్చిన ప్రజా ప్రతినిధులందరూ టీఆర్ఎస్‌కే ఓట్లు వేశారని గులాబీ అధినాయకత్వం అంచనా వేసినట్లు వినికిడి. ఇందుకుగాను క్యాంపులు ఉపయోగపడ్డాయి.అయితే, కరీంనగర్ జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితులున్నాయని అనుకుంటున్నారు. ఇక్కడ రెండు స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్‌కు ఎక్కువ ఓట్లు ఉన్నాయి. కానీ, టీఆర్ఎస్ రెబల్‌గా సర్దార్ రవీందర్ సింగ్‌తో పాటు ఈటల నిలబెట్టిన మరో అభ్యర్థి బరిలో ఉన్నారు. దాంతో టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ షురూ అయింది.
బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రచించిన వ్యూహాలతో టీఆర్ఎస్‌కు షాక్ తగులుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. స్థానిక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులూ టీఆర్ఎస్ అధిష్టానంపైన అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే క్యాంపులకు వెళ్లినా కానీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా అధికార గులాబీలో విభేదాలు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బయటపడతాయి.
Also Read: రాజ్యసభ సీట్లపై సీఎం కసరత్తు.. రేసులో మోత్కుపల్లి?
ఖమ్మంలోనూ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పింక్ పార్టీపై అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు వారు మొగ్గు చూపుతారనే అనుమానాలున్నాయి. ఇక్కడ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వడం పట్ల సొంత పార్టీ నేతలే వ్యతిరేకమయ్యారనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్‌కు బలం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే, తమ బలం నిలుపుకునేందుకు టీఆర్ఎస్ సర్వ శక్తులు ఒడ్డింది. అన్ని అస్త్రాలు ప్రయోగించి మరీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనుకుంటుంది. చూడాలి ఏమవుతుందో మరి..
Also Read: పోలింగ్ కేంద్రంలో మంత్రికేంటి పని? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో ఉద్రిక్తత