Sardar Ravinder Singh: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. దీంతో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సంబరాలు జరుపుకోవడం సంచలనం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన సర్దార్ రవీందర్ సింగ్ శుక్రవారం ఎన్నికలు ముగిశాక సంబరాలు చేసుకోవడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలా చేయలేదని తెలుస్తోంది.

దీంతో విజయంపై ఎవరి లెక్కలు వారికుండగా సంబరాలు జరుపుకోవడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా తమకే ఓటు వేస్తారనే ఉద్దేశంతోనే రవీందర్ సింగ్ సంబరాలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి షాకిస్తూ తామే గెలుస్తామని చెబుతున్నారు. దీంతో ఫలితాలపై అందరికి ఆసక్తి నెలకొంది.
Also Read: యూపీలో మళ్లీ గెలుపు పక్కా అంటున్న బీజేపీ.. కమలనాథుల ధీమాకు కారణం ఏంటి..?
పోలింగ్ సరళిపై లెక్కలు వేసుకుంటున్నారు. తమకు ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. విజయావకాశాలు తమకే ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల సరళిపై ఓ అంచనాకు వస్తున్నారు. కరీంనగర్ లో తమదే గెలుపని అటు అధికార పార్టీ ఇటు రెబల్ అభ్యర్థి తమలో తామే ఆలోచిస్తున్నారు. దీంతోనే ముందస్తు సంబరాలు చేసుకున్నట్లు సమాచారం.
మొత్తానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ తన ప్రభావం చూపుతారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇందుకు గాను అభ్యర్థులు ఎల్. రమణ, భానుప్రసాదరావు, రవీందర్ సింగ్ లు విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. తమకు ఎన్ని ఓట్లు వస్తాయోనని లెక్కలు వేస్తున్నారు. తమదే విజయం అనే విధంగా ఆలోచనలో పడిపోయారు.
Also Read: ‘జగనాలూ’.. కాచుకో ఇక.. ‘ప్రత్యేక హోదా’ రగిలిస్తున్న చంద్రబాబు!